హైదరాబాద్ అంబర్ పేటలోని మున్సిపల్ క్వార్టర్స్‌లో ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.అన్ని శాఖల సమన్వయంతో తెలంగాణ ఆరోగ్యశాఖ అద్భుతంగా పనిచేస్తుందని అంబర్పేట్ ఎమ్మెల్యే వెంకటేష్ అన్నారు…హైదరాబాద్ అంబర్పేట్ లోని ఎంసీఏహెచ్ కాలనీ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఫీవర్ సర్వే ను పరిశీలించారు ..
ప్రజలు ప్రతి ఒక్కరు ఈ సర్వేలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.. జ్వరము జలుబు ఇతర ఏదైనా అనారోగ్య లక్షణాలు ఉంటే సర్వే కి వచ్చిన మెడికల్ సిబ్బంది కి తెలియ చేస్తే వారు మెడికల్ కిట్ అందజేస్తారని ఆయన తెలిపారు.కరోనా లక్షణాలు ఉన్న భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు..