ముంబైలో డ్రగ్స్‌ కింగ్ పిన్ టోని అరెస్ట్: సీవీ ఆనంద్

92
cv anand
- Advertisement -

దేశ వ్యాప్తంగా డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్స్ కింగ్ పిన్ టోనీని అరెస్ట్ చేశామని తెలిపారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..గత వారం రోజులు నుండి ముంబై లో టాస్క్ ఫోర్స్ టీమ్ మకాం వేసి అరెస్ట్ చేశామన్నారు. ఇబ్రాన్ బాబు షేక్ అరెస్ట్ అయిన వెంటనే వాట్సప్ చాట్ డిలీట్ చేశాడు..కాల్ లిస్ట్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని ఎట్టకేలకు టోనీ నీ అరెస్ట్ చేశామన్నారు. 2013 లో వీసా పై నైజేరియా నుండి ముంబై కి వచ్చాడు, వీసా ముగిసిన కూడా ముంబై లోనే ఉంటున్నాడని తెలిపారు.

గార్మెంట్ బిజినెస్ చేస్తూ , టోనీ సహచరులు చెప్పడం తో డ్రగ్స్ దందా చేస్తూ వస్తున్నాడన్నారు. హైదరాబాద్ కి చెందిన ఇంబ్రాన్ బాబు షేక్ , నూర్ మహమ్మద్ ఖాన్, తో కలిసి ఈ డ్రగ్స్ దందా చేస్తున్నారని…ఇంటర్ నేషనల్ డ్రగ్స్ దందా లో కీలక వ్యక్తి స్టార్ బాయ్ , ఇతనే కింగ్ పిన్ అన్నారు. స్టార్ బాయ్ ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియదన్నారు. సినిమాల్లో చూపించేలాగా డ్రగ్స్ కింగ్ పిన్ ఎవరికి తెలియకుండా ఎలా ఉండటాడో కూడా తెలియ కుండా ఈ దందా చేస్తున్నారన్నారు.

రిమోట్ యాక్సిన్ ద్వారా పని చేస్తున్నాడు.. ఈ డ్రగ్స్ ను షిప్ ద్వారా ముంబై కి తీసుకొస్తున్నారని చెప్పారు. టోనీ తో సంబంధాలు కలిగిన 13 మంది సంపన్నుల వివరాలు బయటికి వచ్చాయని…న్యాయ నిపుణులను సంప్రదించి, పోలీస్ ఉన్నతాధికారులు సలహాల తీసుకొని డ్రగ్స్ తీసుకుంటున్న వారి పై కూడా కేసులు పెడుతున్నాం అన్నారు. వేయి కోట్లు బిజినెస్ చేసే నిరంజన్ అనే బిజినెస్ మ్యాన్ 30 సార్లు డ్రగ్స్ తీసుకున్నాడు తేలిందని..వీరు ఎవ్వరెవరికి డ్రగ్స్ సప్లై చేశారు అనేది దర్యాప్తు చేస్తున్నాం అన్నారు.

- Advertisement -