మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడీ. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా నాలుగో సాంగ్‌ని రిలీజ్ చేయనున్నారు.
జనవరి 26 రిపబ్లిక్ డే,రవితేజ బర్త్ డే కానుండటంతో ఫుల్ కిక్ ఇచ్చే పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నటీనటులు: రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్.