కరోనా వ్యాప్తి.. ఏపీలో ప్రభుత్వం కీలక నిర్ణయం..

53
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి మార్గదర్శకలు జారీ చేస్తున్నాయి. కాగా ఏపీలో నిన్న 4 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, నేడు 7 వేలకు చేరువలో కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు నుండి నైట్ కర్ఫ్యూ విధించింది. నేటి నుంచి జనవరి 31 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుండగా, నేడు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

-రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ
-రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
-వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రుల సిబ్బంది, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్), టెలికాం సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది, పెట్రోల్ బంకులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.
-చికిత్స పొందుతున్న రోగులు, గర్భవతులకు మినహాయింపు
-విమానాశ్రాయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వారికి మినహాయింపు
-షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా.
-నైట్ కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి అనుమతి
-ఇండోర్ ప్రదేశాల్లో 100 మందికి మాత్రమే అనుమతి
-సరకు రవాణా వాహనాలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.

- Advertisement -