కోవిడ్‌ నియంత్రణపై సీఎం జగన్‌ సమీక్ష..

92
- Advertisement -

కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైయస్‌ జగన్‌ తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీలో కొవిడ్ నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏపీలో వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మాన్ని వేగవంతం చేయ‌డంతో పాటు రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేసే అంశాల‌పై సూచనలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్(నాని), సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌(డ్రగ్స్‌) రవిశంకర్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరైయ్యారు.

- Advertisement -