శ్రీవారిని దర్శించుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా..

103
- Advertisement -

తొలి ఏకాదశి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గుప్తా..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ బాగుండాలని, ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, సహా ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ కు బాటలు వేస్తూ.. ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ.. సంక్షేమంలో, అభివృద్ధి లో తెలంగాణ ను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, సుభిక్షంగా ఉండాలని, రైతులు అంతా పాడి పంటలతో విలసిల్లాలని అందరూ ఆనందంగా వుండాలని కోరుకున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో. ఉప్పల దంపతులు.. శ్రీమతి & శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త-స్వప్న గార్లు, కుమారులు: ఉప్పల సాయి కిరణ్, ఉప్పల సాయితేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -