- Advertisement -
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఇప్పటివరకు ఈ లిస్ట్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌లలో 1,161 పరుగులతో టాప్‌లో ఉండగా తర్వాత స్ధానంలో 624 పరుగులతో ద్రావిడ్ ఉన్నారు. తాజాగా ద్రావిడ్ స్ధానాన్ని అధిగమించారు కోహ్లీ. కేవలం 7 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ.. 50కి పైగా సగటుతో 688పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- Advertisement -