కళ్యాణ్ దేవ్ ‘కిన్నెరసాని’ ట్రైలర్‌కు ముహుర్తం ఖరారు..

165
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమెగా హీరో ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ ‘కిన్నెరసాని’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అశ్వద్ధామ మూవీ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు అతి సర్వత్ర వర్జయత్ అనేది ఉప శీర్షిక. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది. డిసెంబర్‌ 30 ఉదయం 11 గంటలకు ఏఎంబీ సినిమాస్‌లో లాంఛ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించన పోస్టర్‌ను కూడా తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలై ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు మంచి రెప్పాన్స్‌ వచ్చింది.ఈ మూవీకి మహతి సాగర్ సంగీతం అందించారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

- Advertisement -