రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల నిరసనలు..

125
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రైతులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనల బాటపట్టారు. ఉదయం నుంచే గ్రామాల్లో రైతులు చావు డప్పు వేస్తూ కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులు కల్లాల వద్దే వరిగడ్డితో దిష్టిబొమ్మను రూపొందించి తగులబెట్టారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతులు నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు.. ఎంఎస్‌పి సెంటర్లు ఏర్పాటు చేయాలని యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ శవయాత్ర నిర్వహించారు. అనంతరం ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని.. చావు డబ్బులతో నిరసన ప్రదర్శనలు చేశారు. అలాగే నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -