కేసీఆర్‌ కళ్యాణ మండపాన్ని పరిశీలించిన మంత్రి..

171
- Advertisement -

రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యకర్రమాలను పరిశీలించారు. ఇందులో భాగంగా వేల్పూర్ మండలలో నిర్మించిన 112 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించడం జరిగింది. పనులన్నీ పూర్తి కావడంతో ఈ నెల 8 వ తేదీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారభించి అర్హులైన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేయడం జరుగుతుంది. ప్రారంభోత్సవం రోజు చేయవలసిన ఏర్పాట్లను స్థానిక నాయకులకు,అధికారులకు మంత్రి ఆదేశించారు. అలాగే వేల్పూర్‌ మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు వెడల్పు,డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద చేయవలసిన రోడ్డు వెడల్పు మరియు డివైడర్ పనులను పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అతి త్వరలోనే పనులన్నీ నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

అంతకుముందు వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే సిడిపి నిధులు 50 లక్షలతో నూతనంగా నిర్మించి పనులు పూర్తి అయిన కేసీఆర్‌ ప్రజా కళ్యాణ మండపాన్ని పరిశీలించారు మంత్రి. అతి తొందరలో కళ్యాణ మండపాన్ని ప్రారంభించి అతి తక్కువ ఖర్చుతో గ్రామంలోని పేద ప్రజలు వివాహాలు ఇతర శుభకార్యాలు జరుపుకునేలా అందుబాటులోకి తీసుకురాబడుతుందన్నారు. అలాగే ఇక్కడ వివాహాలు జరుపుకునే పేద ప్రజలకు వంట సామగ్రి, కుర్చీలు,డైనింగ్ టేబుల్స్ లాంటి ఇతర వస్తువులు ఇబ్బంది లేకుండా ఉండటానికి మా నాన్నమ్మ – తాతయ్య పేర్ల మీదుగా సుమారు 5 లక్షల సామగ్రిని ఈ కళ్యాణ మండపానికి వితరణ చేశామని మంత్రి తెలిపారు. ఇలాంటి కళ్యాణ మండపాలు జిల్లాలో బాల్కొండ,మోర్తాడ్,కమ్మర్పల్లి మండల కేంద్రాలలో ఒక్కోటి 50 లక్షలతో మంజూరు చేశామని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -