ఆర్బేట్రేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రస్తుతం 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయించామని, శాశ్వత భవనం కోసం త్వరలో పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని సీఎం కేసీఆర్తెలిపారు.
ఇవాళ హెచ్ఐసీసీలో జరిగిన IAMC సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు న్యాయమూర్తులు హాజరైన ఈ సదస్సులో సీఎం మాట్లాడారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.
ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమని సీఎం కేసీఆర్ చెప్పారు. మధ్యవర్తిత్వం అనేది దేశంలో రచ్చబండ లాంటి వేదికల రూపాల్లో ఎప్పటి నుంచో ఉన్నదని చెప్పారు. దేశంలో వివిధ కారణాలతో పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. నగరంలో IAMC ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఆయన తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.