ఒక్క రోజులోనే..అన్ని సినిమాలా..?

193
List of Telugu movies to release in March 2017
- Advertisement -

మార్చి నెలలో చివరి వారం మినహాయిస్తే పెద్ద సినిమాలు రిలీజ్ అవడం తక్కువే.  ఎందుంకంటే.. పరీక్షల హడావిడి బాగా ఎక్కువుండటంతో స్టూడెంట్స్, ఫ్యామిలీస్ థియేటర్లకు రారన్న భయమే అందుకు కారంణం. అందుకే మార్చి నెలలో 2,3,వారాల్లో కూడా పెద్దగా సినిమాల్నిరిలీజ్ చేయరు. అయితే  ఈ సమయంలో చిన్న స్థాయి, విడుదలకు నోచుకోకుండా ఉన్న సినిమాల్ని థియేటర్లలోకి వదిలేస్తుంటారు.

అందుకే..రాబోయే వీకెండ్లో ఆ తరహాలోనే థియేటర్లలోకి సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు కలిపి ఈ వారాంతంలో ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజవుతుండటం విశేషం. అయితే అందులో ముందుగా సీనియర్ నటుడు రెహమాన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ డబ్బింగ్ మూవీ ‘16’ ఈ గురువారం విడుదలవుతోంది. ఆ తర్వాతి రోజు ఎనిమిది సినిమాలు విడుదలవుతాయి.
 List of Telugu movies to release in March 2017
అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ‘వెళ్లిపోమాకే’సినిమా. దిల్ రాజుకు ఈ సినిమా తెగ నచ్చేయడంతో తన బేనర్లో రిలీజ్ చేస్తున్నాడు. ఇక చాలారోజులుగా రిలీజ్ కోసం వెయిట్‌ చేస్తున్న మంచు లక్ష్మి సినిమా ‘లక్ష్మీబాంబు’, అంజలి మూవీ ‘చిత్రాంగద’ శుక్రవారమే ప్రేక్షకులముందుకొస్తున్నాయి. సందీప్ కిషన్-రెజీనా జంటగా నటించిన ద్విభాషా చిత్రం ‘నగరం’ కూడా అదే రోజు విడుదలవుతుంది. ‘ఆకతాయి’, ‘పిచ్చిగా నచ్చావ్’ అనే సినిమాలు కూడా ఆ రోజే వస్తాయి. ఇవేకాకుండా ‘మెట్రో’, ‘నోటుకు పోటు’ అనే డబ్బింగ్ సినిమాలు కూడా ఈ నెల 9కే షెడ్యూల్ అయ్యాయి. మరి ఒకే రోజు రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాల్లో ఏయే సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయో చూడాలి.

- Advertisement -