తెలుగు ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తన రాతలతోనే సినిమాకి జీవం పోసిన సీతారామశాస్త్రి కలం అప్పుడే ఆగిపోయిందంటే.. సినీ లోకం జీర్ణించుకోలేకపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ లోకం నివాళులు అర్పిస్తోంది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరనే వార్త విని చాలా బాధేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. -వెంకటేష్
సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు లేరంటే చాలా బాధగా ఉంది. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. – రవితేజ
జగమంత కుటుంబం మీది మీరు లేక ఏకాకి జీవితం మాది. భరించలేకున్నాం. మీ కవితా భావనలతో మా జీవితాలకు అర్థాలను జోడించిన మీకు ధన్యవాదాలు. మీరెంతో ఉత్తములు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. – ప్రకాశ్ రాజ్
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నాను. -నందమూరి కల్యాణ్ రామ్
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు” – మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?…విశ్వాత్మలో కలిసిపోయావా? – దేవ కట్టా
తెలుగు సాహిత్య శిఖరం… సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… అజ్ఞానపు చీకటి ని తన అక్షర కిరణాల తో వెన్నెల గా మార్చిన సిరివెన్నెల గారికి….. కన్నీటి వీడ్కోలు…. – అనిల్ రావిపూడి
మీ పాటలే మేము నేర్చుకొన్న పాఠాలు మీ సూక్తులు మేము రాసుకొనే మాటలు బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడు అని సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు కానీ పాఠం మధ్యలోనే వదిలేసారు గురూజీ భరించలేని నిజం చెవులు వింటున్నాయి కానీ మనసు ఒప్పుకోవటం లేదు – డైరెక్టర్ మారుతి