- Advertisement -
భారత్ – రష్మా దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సమావేశంలో భాగంగా డిసెంబర్ 6న ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని దృవీకరించింది భారత విదేశాంగ శాఖ. కరోనా లాక్‌డౌన్ తర్వాత రష్యా ప్రెసిడెంట్‌కు ఇది రెండో విదేశీ పర్యటన కాగా.. రెండోసారి భారత్‌కు రానున్నారు.
ఈ భేటీలో ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను చర్చించనున్నట్లు తెలిపింది. అలాగే ఇరుదేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు కూడా భేటీ కానున్నట్లు పేర్కొంది.
ఈ సమావేశంలో హిందూ మహాసముద్రం, ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల్లో పురోగతి, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించడంతో పాటు ఈ సమావేశంలో పలు ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేయనున్నారు.
- Advertisement -