సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత..

66
kavitha mlc
- Advertisement -

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల‌ స్థానిక సంస్థ‌ల నుంచి ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల క‌విత‌.. శుక్ర‌వారం నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్, రిట‌ర్నింగ్ అధికారి సీ నారాయ‌ణ‌ రెడ్డి నుంచి ధృవీక‌ర‌ణ ప‌త్రం అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్, కామారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్న అన్నారు.

నిజామాబాద్‌లో మరొక్కసారి పని చేయడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి నిజామాబాద్‌లో అందరిని కలుపుకొని అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. ఎన్నిక ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన ఎంపీటీసీలు స్థానిక సంస్థలు ప్రజాప్రతినీదులు అందరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అన్నారు. అభివృద్ధి మా ఎజెండాగా ఉంది, ఉంటుంది కాబట్టి, నా ఎన్నికకు ఏకగ్రీవం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మరియు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్సీ కవిత.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కవితమ్మకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియాజేస్తున్నాము. 90 శాతం ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారు, కవితమ్మ గెలుపుకు కృషి చేసినవారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అందరి తరుపున కవితమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -