ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికయినట్టు గెలుపు ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాష్, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, వెంకట్రామి రెడ్డి, కౌశిక్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ… ఆరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమయ్యాయి. మాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు దన్యవాధాలు తెలుపుతున్నాము. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది తెలంగాణ.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ది పని చేస్తాం.. టీఆర్ఎస్ ఒక నూతన ఒరవడీకి శ్రీకారం చుట్టింది.. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేక బీజేపీ కేంద్రం తెలంగాణా ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందని అన్నారు.
మోడీ,బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు.. ఈ ఏడేళ్లలో దేశ జీడీపీ భారీగా తగ్గింది..కరోన సమయంలో మైనస్ కి జీడీపీ వెళ్ళింది.. నరేంద్ర మోడీ గొప్ప పరిపాలన దక్షుడు అయితే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలి అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణ అనేది కేంద్రం పరిధి.. కానీ కేంద్రం కొనటం లేదు.. బీజేపీ తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేస్తున్నదని కడియం విమర్శించారు.