భీమ్లానాయక్‌…మరింత క్లారిటీ

110
naga vamshi
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్‌. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో నుండి పవన్ కళ్యాణ్‌ లుక్ ను చూస్తూ 2022 జనవరి 12న షెడ్యూల్ ప్రకారం “భీమ్లా నాయక్” థియేటర్లలోకి వస్తాడని యువ నిర్మాత అభిమానులకు హామీ ఇచ్చారు.

ఆ పిక్ చూస్తుంటే పోటీకి సిద్ధం అంటూ ‘భీమ్లా నాయక్’ చెప్తున్నట్టుగా ఉంది. “పదం గుర్తుంచుకో! ఈసారి కూడా మిస్ అవ్వదు… థియేటర్లలో కలుద్దాం… 2022 జనవరి 12” అని ట్వీట్ చేసాడు వంశీ. దీంతో మరోసారి “భీమ్లా నాయక్” వాయిదాపై వచ్చిన ఊహాగానాలన్నిటినీ తిప్పికొట్టాడు. ఏదేమైనా సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో మేకర్స్ లేరని స్పష్టం అవుతోంది.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -