తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు…

76
kadiyam
- Advertisement -

తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. హన్మకొండలో మీడియాతో మాట్లాడిన కడియం…రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించడంతో సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నారన్నారు.

మోదీది రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక ప్రభుత్వం, ఆదానీ, అంబానీల ప్రభుత్వం అన్నారు. ఏడేళ్ల కాలంలో భారతదేశ జీడీపీ తగ్గితే… తెలంగాణ జీఎస్టీపీ పెరిగిందన్నారు. భారతదేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. రైతుల విషయంలో అన్నీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుని రైతులకు శఠగోపం పడుతోందన్నారు.

బడా పారిశ్రామిక వేత్తలకు 10లక్షల 60వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన కేంద్రం రైతుల విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం సత్ఫలితాలు ఇచ్చిందని…ఉద్యోగాల కల్పన లేకపోగా… ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారన్నారు.

ఒకవైపు ఆహారపు కొరత ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే మీరు ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు కడియం. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని…బీజేపీ నేతలకు దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

- Advertisement -