టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘లూసీఫర్’ రీమేక్ గాడ్ ఫాదర్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో కీలక పాత్రలో నయనతార కనిపించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఒరిజినల్ వర్షన్ ‘లూసీఫర్’లో హీరోయిన్ పాత్ర ఉండదు. హీరో సోదరి పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. కనుక ఆ పాత్రకు గాను నయనతారను తీసుకుని ఉంటారని తెలుస్తోంది. ఈ పాత్రకు గాను పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించిన మేకర్స్ చివరకు నయన్‌ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.
అయితే ఇపుడు నయనతార గాడ్ ఫాదర్ సినిమాకు తీసుకుంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం నయన్ ఈ చిత్రానికి రూ.4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. తెలుగులో ఇప్పటివరకు హీరోయిన్లకు ఇస్తున్న పారితోషికంలో ఇదే అత్యధికం. ఆ పాత్రకు నయన్ పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. నయనతార గతంలో చిరంజీవితో జోడీగా సైరాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.