‘ఊరికి ఉత్త‌రాన‌’ ఖచ్చితంగా హిట్ అవుతుంది – హీరో నరేన్

255
- Advertisement -

నరేన్, దీపాలి శర్మ జంటగా నటించిన సినిమా ఊరికి ఉత్తరాన. ఈ చిత్రాన్నిఈగల్ ఐ ఎంటైర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వనపర్తి వెంకటయ్య , రాచాల యుగంధర్ నిర్మించారు. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించిన ఊరికి ఉత్త‌రాన‌ సినిమా ఈ నెల 19న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు సతీష్ మాట్లాడుతూ…ఊరికి ఉత్త‌రాన‌ సినిమా టెక్నికల్ గా బాగుందంటే మా సాంకేతిక నిపుణులకు క్రెడిట్ దక్కుంది. అలాగే రైటర్స్ ఆకట్టుకునేలా రాశారు. సినిమా బాగా వచ్చింది. హీరో నరేన్ నేను కథ చెప్పినప్పటి నుంచి నన్ను నమ్మి నేను అనుకున్నట్లు సినిమా చేసేలా ప్రోత్సహించారు. బడ్జెట్ పెరిగినా అనుకున్నది అనుకున్నట్లు చేశాం. రేపు థియేటర్లలో మీకు తప్పకుండా ఊరికి ఉత్త‌రాన‌ సినిమా నచ్చుతుంది. అన్నారు.

హీరో నరేన్ మాట్లాడుతూ…టాలీవుడ్ లో చిన్న సినిమాలకు ఎన్ని కష్టాలుంటాయో మీకు తెలుసు. మేమూ ఆ ఇబ్బందులన్నీ పడ్డాం. ఫైనల్ గా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఊరికి ఉత్త‌రాన‌ సినిమా సక్సెస్ మీట్ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం. సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మేము ఎందుకు ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. సినిమా కోసం వేసిన వరంగల్ సెట్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అన్నారు.

హీరోయిన్ దీపాలి శర్మ మాట్లాడుతూ…ఊరికి ఉత్త‌రాన‌ మీరు రెగ్యులర్ గా చూసే లవ్ స్టోరి కాదు. చాలా కొత్త కథ, ప్లెజంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ చిత్రంలో శైలు అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్రను బ్యూటిఫుల్ గా మలిచారు మా దర్శకుడు సతీష్. నా క్యారెక్టర్ మాత్రమే కాదు సినిమాలో ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది. హీరో నరేన్ నాకు కంప్లీట్ గా సపోర్ట్ చేసి బాగా నటించేలా చేశారు. ఊరికి ఉత్త‌రాన‌ థియేటర్లలో తప్పకుండా చూడండి. అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత మోహన్ వడ్లపట్ల పాల్గొని చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ లు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీకాంత్ అరుపుల‌; సంగీతంః భీమ్స్ సిసిరోలియో- సురేష్ బొబ్బిలి; సాహిత్యంః సురేష్ గంగుల‌, పూర్ణాచారి; పీఆర్వోః వంశీ-శేఖ‌ర్‌; కో-ప్రొడ్యూస‌ర్ః రాచాల యుగంధ‌ర్; నిర్మాతః వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య‌, ద‌ర్శ‌క‌త్వంః స‌తీష్ అండ్ టీమ్ .

- Advertisement -