తెలంగాణలో వరి ధాన్యం కొంటారా..కొనరా: సీఎం కేసీఆర్

91
kcr
- Advertisement -

తెలంగాణలో వరి ధాన్యం కొంటారా..కొనరా తేల్చి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. రైతు ధర్నాలో మాట్లాడిన సీఎం కేసీఆర్…. నాడు రాష్ట్రం కోసం కొట్లాడాం..నేడు రైతుల కోసం కొట్లాడుతున్నాం అన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు..వారి డిమాండ్లు పరిష్కరించలేక..మోడీ ప్రభుత్వం ఆగం చేస్తుందన్నారు.

గ్లోబల్ ఇండెక్స్ సర్వే 116 దేశాల్లో సర్వే చేస్తే మన దేశం 101 స్తానం లో నిలిచింది..బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా ఏనుక బాటులో ఉంది.40 కోట్ల ఎకరాల భూమి, నీళ్లు, రైతులు, శాస్త్రవేత్తలు ఉన్నారు..కేంద్రం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందన్నారు.కేంద్రం రైతులను బతుకనిస్తుందా లేదా. రాష్రం తెచ్చుకొని చెరువు కుంటలు బాగు చేసుకొని ఇప్పుడే బాగుపడుతున్నాం అన్నారు.

ఆహార ఉత్పత్తులు నిల్వ చేసే తహతు మీ చేతుల్లో ఉంది.ఆహార కొరత తీర్చాలి..లక్షా, రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆదుకోవాలి..రైతుల డిమాండ్ లు పరిష్కరించలేక..రైతుల మీద కార్లు ఎక్కిస్తున్నారు.. యసంగి పంట కొనుగోలు చేస్తారా లేదా అంటే సమాధానం చెప్పకుండా గ్రామైక్య కేంద్రాలకు పోయి ఎదో లొల్లి చేస్తున్నారని మండిపడ్డారు.

గుంట ఉన్న రైతుకు కూడా 5 లక్షల బీమా ఇస్తున్నాము. రైతు బంధు ద్వారా పెట్టబడి సహాయం చేస్తున్నాం..ధాన్యం కోనని కేంద్రం మెడలు వంచాలి..fci ఎవరి ఆధ్వర్యంలో ఉంది..వాట్సప్, ఫేస్ బుక్ లో అని అబద్ధాల ప్రచారం, 7 మండలాలను గుంజుకున్నా, విద్యుత్ కేంద్రం గుంజుకున్నా అడుకోలే. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం అవసరం ఉన్న, గిరిజన విద్యాలయం అవసరం ఉన్నా ఇవ్వలేదన్నారు.

చేతులు జోడించి చెప్తున్నా కొంటారాకొనరా చెప్పండి కొనము అంటే రైతులకు చెప్తామ్..మాకు పదవులు మాకు గొప్ప కావు..ప్రజలే ముఖ్యం..ఎన్నో పదవులను తృణప్రాయంగా వదులుకున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం, బీసీ రిజర్వేషన్లు పెంచాలని, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే ఉలుకులేదు..పలుకు లేదు..దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లు ఉంటే 30 వేల టీఎంసీల నీళ్లు కూడా వాడటం లేదన్నారు. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయాలని రైతులకు మద్దతుగా పోరాటం చేసి మోదీ ప్రభుత్వ మెడలు వంచుతాం అన్నారు.

- Advertisement -