వ్యాపారవేత్త గంగారెడ్డి మృతి.. మంత్రి అల్లోల సంతాపం

58
indrakaran reddy
- Advertisement -

ప్రముఖ వ్యాపారవేత్త, మద్రాసీ చక్కర్‌ బీడీ పరిశ్రమ వ్యవస్థాపకుడు ప్రొద్దుటూరి గంగారెడ్డి మ‌ర‌ణం ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. గంగారెడ్డి కుటుంబ సభ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. ఆయ‌న ఆత్మ‌కు స‌ద్గ‌తులు క‌ల‌గాల‌ని ప్రార్థించారు.

నిర్మ‌ల్ జిల్లా లోకేశ్వ‌రం మండ‌లం బాబాపూర్ గ్రామానికి చెందిన గంగారెడ్డి వ‌రంగ‌ల్ లో స్థిర‌ప‌డ్డార‌ని, గ‌తంలో ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. చక్కర్‌ బీడీ ఫ్యాక్టరీ స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారని, సామాజిక సేవ కార్యక్రమాల్లో గంగారెడ్డి ముందుండే వారని ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు.

- Advertisement -