కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు మంత్రి హరీష్ రావు. నిలోఫర్ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు..హైసీయా , నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయం అని హరీశ్‌రావు అన్నారు.
పిల్లలకు వైద్యం ఎలా అందుతుంది.. ఏ వ్యాధి బారిన పడ్డారు.. సమయానికి భోజనం అందుతుందా.. అనే అంశాలను వారి తల్లులను హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.
కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. తల్లీశిశు మరణాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. నగరం నలువైపులా నాలుగు మెడికల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే మరో 8 వైద్య కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు.