- Advertisement -
తెలంగాణ కంభమేళాగా ప్రసిద్ధి చెందిన వన దేవతల జాతరకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. ఫిబ్రవరి 16-19 వరకు ఈ మహా జాతర జరగనుంది. 16న సారలమ్మ కన్నెపల్లి నుండి గద్దెపైకి రాక, 17న చిలకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రాక, 18న భక్తులకు అమ్మవార్ల దర్శనం, 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.
రెండేళ్లకు ఒక్క సారి వచ్చే ఈ మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు వస్తారు. ఈ సారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ జాతర పనుల కోసం ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది.
జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో కొందరూ భక్తులు ఇప్పటి నుంచే అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు.
- Advertisement -