9న అల్పపీడనం..భారీ వర్షాలు

97
rains
- Advertisement -

ఈ నెల 9న అల్పడీనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి పశ్చిమ బంగాళాఖాతం దగ్గరలో ఉత్తర తమిళ్ నాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

అల్పపీడనం ఎఫెక్ట్‌ ఏపీపై ఎక్కువగా ఉంటుందని గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు ఉత్తర కోస్తా ఆంధ్ర, రాయలసీమ లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని…మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -