ఐపీఎల్‌పై విమర్శలు సరికాదు: గంభీర్

156
gautam gambhir
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌లో భారత్ చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు ఓటములతో సెమీస్‌కు వెళ్తుందా లేదా అని అభిమానులను నిరాశ పరుస్తుండగా ఐపీఎల్‌పై పెద్ద ఎత్తునన విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించారు భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్.

అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ ఓడిపోతే అందరూ ఐపీఎల్ ను అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మిగితా జట్లు కూడా మనకంటే బాగా ఆడతాయి అనేది తెలుసుకోవాలన్నారు. దానిని మీరు ఎంత త్వరగా అంగీకరిస్తారో… అది మీకు అంత మంచిది అన్నారు.

కివీస్ పై ఆడిన మ్యాచ్ లో ఆటగాళ్లు ధైర్యంగా లేరు. దానికి ఐపీఎల్ కు సంబంధం ఏంటి అని అడిగిన గంభీర్… 2019 ప్రపంచ కప్ లో సెమీ-ఫైనల్‌ కు వచ్చిన సమయంలో కూడా… ఐపీఎల్‌లో ఆడి మేము ప్రపంచ కప్‌ కు వచ్చాము అని గుర్తు చేశారు గంభీర్.

- Advertisement -