హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో ఉన్న వారికి ఈ సాయంత్రం 7 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే భారీగా పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం ఐదు గంటల వరకు హుజూరాబాద్‌లో 76.26 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. హుజురాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.7 వరకు చాలా చోట్ల పోలింగ్ ముగిసింది. 224,237 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 86.33 పోలింగ్ శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చాలా బాగా చేశారు.కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ లో ఈ వీ ఎం లను భద్రపరుస్తున్నాం అన్నారు. మూడు అంచల భద్రత ఏర్పాటు చేశారు సీ సీ కెమెరాల నిఘా లో స్ట్రాంగ్ రూమ్ ల్లో ఈ వీ ఎం ల భద్రత ఉంది. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సిల్ చేస్తాం. స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర కేంద్ర బలగాలతో పాటు ,రాష్ట్ర పోలీస్ లు భద్రతను పర్యవేక్షిస్తారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర అభ్యర్థులు కానీ లేదా వారి ఎజెంట్స్ ఉండవచ్చు. 24 గంటల పాటు నిఘా ఉంటుంది. 3.60 కోట్ల క్యాష్, మద్యం సీజ్ చేశాం. అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని తెలిపారు.