బిగ్ బాస్ 5..జైలుకి సన్నీ!

219
sunny
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 55 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 55వ ఎపిసోడ్‌లో భాగంగా సన్నీ జైలుకు వెళ్లారు. జెస్సీ సంచాలకుడిగా ఎంత చెత్తగా చేశాడో చూశాం కదా.. ఇప్పటి నుంచి కలిసే ఆడదాం అని మానస్‌తో అన్నాడు సన్నీ. మానస్ టాస్క్ ఆడే విధానం ఎలా ఉందో వివరిస్తూ పేపర్‌లో రాసి ఉన్నది చదివి వినిపించాడు. మొదటి రెండు రౌండ్స్‌లో మొదటి సర్కిల్‌లో నడవాలి.. తదుపరి రౌండ్‌లో రెండో సర్కిల్‌లో నడవాల్సి ఉంటుంది. ఆఖరి రౌండ్‌లో చివరి సర్కిల్‌లో నడవాల్సి ఉంటుంది.. ఈ లెక్కన మొత్తం 5 రౌండ్స్ ఉంటాయి. మొత్తం ఆరుగురు కంటెంట్స్ ఉంటే ఐదు రౌండ్లు ఉంటే.. సింగిల్ సింగిల్ ఎలిమినేషన్ అవుతారు.. మరి జెస్సీ ఒకేసారి ఇద్దర్ని ఎలా ఎలిమినేట్ చేస్తాడంటూ అసలు పాయింట్‌ను బయటకు తీశాడు.

సన్సీ మళ్లీ రూల్ బుక్ చదువున్నాడని త్రిమూర్తులు(జెస్సీ,షణ్ముఖ్,సిరి)ల దగ్గర రవి ప్రస్తావించడంతో వారు సెటైర్లు వేశారు. ఆనీ మాస్టర్.. శ్రీరామ్, జెస్సీలతో కూర్చుని.. సంచాలకుడిగా గ్రేట్ జాబ్ అంటూ పొగిడింది. అనీ మాస్టర్ సైతం సన్నీపై సెటైర్లు వేసింది. ఇక కాజల్‌…..హౌస్‌లో మాస్క్ ఉన్న ఒకే ఒక్క పర్సన్ శ్రీరామ్ చంద్ర అని సన్నీ, మానస్‌లతో చెప్పింది.

తర్వాత పూల్ దగ్గర సన్నీ ఒంటరిగా మాట్లాడుకుంటూ దొంగలు హీరోలు అవుతున్నారు.. హీరోలు దొంగలు అవుతున్నారు వీళ్లతో ఎలా నెట్టుకునిరావాలో ఛీ అంటూ తనలో తాను మాట్లాడుకున్నాడు. తర్వాత ఈ వారం వరెస్ట్ పెర్ఫామర్ ఎవరో చెప్పాలని బిగ్ బాస్ తెలపగా మొదటిగా షణ్ముఖ్.. కాజల్‌ని, జెస్సీ…సన్నీని,లోబో….. ఆనీ మాస్టర్‌ని,మానస్‌…జెస్సీని, రవి….సన్నీని నామినేట్ చేశారు.

తర్వాత సిరి…సన్నీని వరస్ట్ పెర్ఫామర్‌గా నామినేట్ చేస్తూ.. సంచాలకుడితో సన్నీ వ్యవహరించిన బిహేవియర్ నాకు నచ్చలేదని చెప్పింది. దీంతో సన్నీ ఆమెకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. నువ్ కత్తి పట్టుకుని గేమ్‌లో గెలివాలని చూశావ్.. అది మంచి బిహేవియరా అని అడిగాడు. దీంతో సిరి షాక్ తింది. అనీ మాస్టర్‌…ప్రియాంకని నామినేట్ చేయగా మొత్తంగా ఎక్కువ ఓట్లు సన్నీకి రావడంతో ఈ వారం జైలుకి వెళ్లారు సన్నీ.

- Advertisement -