నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే..తన వందో చిత్రంతో సంచలనం సృష్టించిన బాలయ్య నూటా ఒకటో చిత్రాన్ని మాత్రం ప్లాప్ లో ఉన్న పూరి జగన్నాధ్ చేతిలో పెట్టాడు. ఇటీవలే అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలయ్య సినిమా అంటేనే ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్.
ఆయన సినిమాలు, డైలాగ్‌లకే కాదు. బాలయ్యకు సంబంధించిన సినిమా టైటిల్స్ కూడా అభిమానులు ఫిదా అయిపోవాల్సిందే. అయితే పూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలయ్య సినిమాకి ‘మొనగాడు’ అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే టైటిల్ తో సోగ్గాడు శోభన్ బాబు ఓ సినిమా చేసాడు . 1976 లో రిలీజ్ అయిన ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది .
బాలయ్య ని పవర్ ఫుల్ రోల్ లో చూపించనున్న పూరి ‘మొనగాడు’ టైటిల్ పట్ల ఆసక్తి చుపిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ కి బాలయ్య కూడా ఓకే అంటే ఇక అదే ఫిక్స్ లేదంటే మరో టైటిల్ అన్నమాట. మరి బాలయ్య మొనగాడు టైటిల్ కు ఊ కొడతాడా ఉలిక్కి పడతాడా చూడాలి. అంతేకాకుండా బాలయ్య సరసన ఇద్దరు కొత్త భామలను పరిచయం చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు పూరి.