నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్న మిన్నల్ మురళి చిత్రంతో క్రిస్మస్ మరింత సందడిగా మారనుంది. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే మిన్నల్ మురళి. ఈ చిత్రాన్ని సోపియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్.. సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను పోషిస్తున్నారు. గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 24న ఈ మూవీ ప్రీమియర్ కాబోతోంది. ఈ చిత్రంలో మళయాలంలో రుపొందినప్పటికీ.. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ కానుంది.
దర్శకుడు బసిల్ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘సూపర్ హీరోల్లాంటి కల్పిత కథలంటే నాకు చాలా ఇష్టం. కామిక్ బుక్స్ నుంచి మొదలుకొని వచ్చిన ప్రతీ సూపర్ హీరో చిత్రమంటే నాకు ఇష్టం. ఓ సూపర్ హీరో కథతో ఆడియెన్స్ అందరినీ ఆకట్టుకోవాలనే కల ఉండేది. అది ఈ మిన్నల్ మురళీ సినిమాతో నెరవేరుతోంది. ఈ అవకాశం ఇచ్చినందుకు వీకెండ్ బ్లాక్ బస్టర్స్, టోవినో, నెట్ ఫ్లిక్స్ వారికి థ్యాంక్స్’అని అన్నారు.
టోవినో థామస్ మాట్లాడుతూ.. ‘మిన్నల్ మురళీ అనే చిత్రం ఆద్యాంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చివరి క్షణం వరకు ఎంగేజ్ చేస్తుంది. నేను ఈ చిత్రంలో జైసన్ అక మిన్నల్ మురళీ పాత్రను పోషించాను. మెరుపును తాకడం వల్ల అతీంద్రియ శక్తులు లభిస్తాయి. ఈ పాత్రను పోషించడం నాకు ఎంతో సవాల్గా మారింది. బసిల్ జోసెఫ్ విజన్ అనితర సాధ్యమైంది. ఆయన విజన్‌ను ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
వీకెండ్ బ్లాక్ బస్టర్స్ నుంచి సోఫియా పాల్ మాట్లాడుతూ.. ‘ఇది వరకు ఎన్నడూ చేయనిది, ఎంతో గొప్ప సినిమా తీస్తున్నామని మాకు ముందే తెలుసు.ఇలాంటి కష్టకాలంలోనూ ఎంతో చక్కగా సినిమాను పూర్తి చేశాం. ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టీం అంతా కలిసి కష్టపడి చేయడంతోనే సినిమా తీయడం సాధ్యమైంది. ఈ రెండేళ్ల ప్రయాణంలో ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి రాత్రి పగలు అని తేడా లేకుండా పని చేశారు. సూపర్ హీరో మిన్నల్ మురళీ సినిమాను మీరంతా చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
చెడు మీద మంచి చేసిన యుద్దాన్ని మిన్నల్ మురళి చిత్రంలో చూడవచ్చు. అది కూడా కేవలం నెట్ ఫ్లిక్స్‌లోనే.
దర్శకుడు : బసిల్ జోసెఫ్
నటీనటులు : టోవినో థామస్, గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్
రచయిత, స్క్రీన్ ప్లే, మాటలు : అరున్ ఏ ఆర్, జస్టిన్ మాథ్యూస్
పాటలు : మను మంజిత్
సంగీతం : షాన్ రెహ్మాన్, సుషిన్ శ్యామ్.