బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన 120 బీసీ సంఘాలు..!

170
etela
- Advertisement -

హ‍ుజురాబాద్ ఉప ఎన్నికలకు మూడు రోజుల ముందు అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది..తనకు తాను బీసీ బిడ్డగా చెప్పుకునే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని 120 బీసీ సంఘాలు ఊహించని షాక్ ఇచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఓ హాటల్‌లో సమావేశమైన బీసీ సంఘాల జేఏసీ నేతలు హుజురాబాద్ బై ఎలక్షన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కి మద్దతు తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తనపై బీజేపీ నేతలు చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీల కోసం బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.. బీసీ కులగణన చేయకపోతే ఎందుకు ఓటేయాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. నేను రాజకీయం చేస్తలేను. వాళ్ల లాగా నేను భూములు కబ్జా చేయలేదు. వాళ్ళ లాగా సీఎం పదవిపై ఆశపడలేదు. బీసీ బిడ్డ అని చెప్పుకునే వ్యక్తులు బీసీలకు ఏం చేశారు? అని ఈటల రాజేందర్‌ను ఉద్దేశిస్తూ ఆర్.కృష్ణయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క హాస్టల్ పెట్టలేదన్నారు. బీసీలు అడగ్గానే విద్యార్థుల కోసం కేసీఆర్ గురుకులాలు పెట్టారని.. కల్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చారని కృష్ణయ్య అన్నారు. బీసీలకు మేలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ని తిట్టాలని బీజేపీ నేతలు ఫోన్ చేస్తున్నారని.. ఇదెక్కడి రాజకీయం అని కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీ బంధు పథకం కూడా పెడతామని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని ఆయన అన్నారు.

బీజేపీ చరిత్ర మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకమేనని మండిపడ్డారు. బీజేపీలోని అనేకమంది బీసీ నేతలు తమకు కనీస గౌరవం దక్కటంలేదని మథనపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. హుజూరాబాద్‌లో బీజేపీకి ఓట్లేయద్దు..ఈటల రాజేందర్‌ను ఓడించి బీసీ జాతి సత్తా చాటాలని పిలుపునిచ్చారు హుజూరాబాద్‌లోనే కాదు ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీకి వ్యతిరేకంగా బీసీ జాతిని ఏకంచేసి ఉద్యమిస్తామని ప్రకటించారు. బీసీ జేఏసీ నేతలు బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేసిన బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ 18 ఏళ్లు పదవి అనుభవించారని.. ఇంకా చాలదా ఆయనకు అని నిలదీశారు. ఈ రెండేళ్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కి అవకాశమిచ్చి గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్‌కు ముందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలోని 120 బీసీ సంఘాలు టీఆర్ఎస్‌ అభ్యర్థి గెల్లుకు మద్దతు పలుకుతూ తీర్మానం చేయడమే కాకుండా…బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఓట్లు వేయద్దని బీసీలకు పిలుపునివ్వడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. బీసీ కార్డు ప్రయోగిస్తున్న ఈటల రాజేందర్‌కు పోలింగ్‌కు ముందు జరిగిన ఈ పరిణామంతో కోలుకోలేని దెబ్బ తగిలినట్లైంది..

- Advertisement -