కోర్టు ఇచ్చిన షాక్‌తో కంగుతిన్న కంగన రనౌత్..

197
Kangana Ranaut
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ,ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తనపై చేసిన వ్యాఖ్యలపై పాటల రచయిత జావెద్ అఖ్తర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ముంబై అంధేరిలోని మెట్రోపాటిలన్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతున్నారు. అయితే నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదని, కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కంగన పిటిషన్ దాఖలు చేసింది.

అయితే, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సదరు కోర్టు కంగన పిటిషన్ ను తోసిపుచ్చింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగానే విచారణ జరుపుతున్నారని కోర్టు తెలిపింది. కంగనకు వ్యతిరేకంగా పక్షపాతాన్ని ప్రదర్శించలేదని చెప్పింది. చట్టబద్ధంగా వెళ్లడం కంగనకు వ్యతిరేకంగా వ్యవహరించినట్టు కాదని తెలిపింది. కేవలం అనుమానం కారణంగా కేసులో ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు తరలించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

జావేద్ అక్తర్ గత ఏడాది నవంబరులో దాఖలు చేసిన పిటిషన్‌లో, కంగన రనౌత్ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించాయని ఆరోపించారు. బాలీవుడ్‌లో కోటరీని ప్రస్తావిస్తూ, తన పేరును అనవసరంగా ప్రస్తావించారని తెలిపారు. దీంతో అక్తర్‌పై కంగన కూడా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తనను ఆయన నేరపూరితంగా బెదిరించారని, డబ్బు గుంజేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

- Advertisement -