రొమాంటిక్‌తో ఆకాష్ హిట్‌ కొడతాడు- విజయ్ దేవరకొండ

104
Vijay Deverakonda
- Advertisement -

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాకు అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రొమాంటిక్ గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను వ‌రంగ‌ల్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు లైగ‌ర్‌ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీగా జ‌నం హాజ‌రై ఈవెంట్‌ను గ్రాండ్ స‌క్సెస్ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘నమస్తే వరంగల్. ఎక్కడెక్కడో ఈ ఈవెంట్ చూస్తున్న అందరికీ బిగ్ హగ్. నేను వచ్చినప్పుడల్లా మీరింత ప్రేమ చూపిస్తే నాకు థాంక్యూ ఎలా చెప్పాలో తెలియదు. నా వైపు నుంచి ఒక్కటే చేయగలుగుతా. మళ్ళీ లైగర్‌కి ఇక్కడికి రాగలుగుతా.. ఎట్లాగూ పూరి సహా అందరూ ప్రామిస్ చేశారు. మీకు థాంక్యూ చెప్పగలిగే ఒకే విధానం. మళ్ళీ నా ఫంక్షన్ కి ఇక్కడికి రావడమే. ఇక్కడికి వస్తే మొత్తం నా లైగర్ సెట్ కి వచ్చినట్టుంది. అంతా మా లైగర్ టీమ్. వీళ్లంతా చాలా హెల్దీగా, సంతోషంగా ఉండాలి. వీళ్ళెంత హ్యాప్పీగా ఉంటే లైగర్ పనులు అంత వేగంగా జరుగుతాయి. రొమాంటిక్‌ మనస్ఫూరిగా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. కేతిక చాలా బాగుంది. సూపర్ ఇంటెలిజెంట్. ఆమె ఎప్పుడు కలిసినా మా కోసం పాడాల్సిందే. కేతిక నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇక మన హీరో ఆకాష్.. అతనిలో ఓ ఫైర్ ఉంది. దాన్ని ఇప్పుడు చేసి చూపించాలి. మీ నాన్న కాలర్ ఎత్తాలి. ఆకాష్ కి సినిమా పిచ్చి చాలా ఎక్కువట. సినిమా బాగా లేకపోయినా చూసి పాజిటివ్‌గానే చెబుతారట. అలాంటి వారు ఉండాలి. ఆకాష్ సక్సెస్ కొడతాడని నమ్ముతున్నా. ఈ సినిమా ప్రొడ్యూసర్, రైటర్లు పూరి గారు ఛార్మి గారంటే నాకు ఇష్టం. మీ అందరికీ ఈ రోజు లైగర్ సినిమా గురించి ఓ క్లారిటీ ఇద్దామనుకున్నా. డెస్టినీ పూరి గారిని మా లైఫ్ లోకి తీసుకొచ్చింది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. లైగర్ సినిమాలోని ఒక్క విజువల్ చూస్తే అది మీకే అర్థమవుతుంది. మేము ఒక్కటే ఫిక్సయ్యాం. 2022లో లైగర్‌తో ఇండియాని షేక్ చేయాలె. ఫిక్స్ అయిపోండి. అక్టోబర్ 29న రొమాంటిక్, 2022లో లైగర్‌తో వస్తున్నాం’ అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ అని పేరు పెట్టిన తరువాత నాకు సబ్జెక్ట్ చెప్పారు. కథ వినగానే రొమాంటిక్‌గా ఫీల్ అయ్యాను. అందులోంచి వచ్చినవే ఈ పాటలు’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ వ‌రంగ‌ల్‌ శ్రీను మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో నాకు ఓ ఫ్యామిలీ దొరికింది. అదే పూరి జగన్నాథ్ ఫ్యామిలీ. ఆయన ఎంతో మంచివారు. ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటే ఛార్మీ గారి జీవితాన్ని చూస్తే చాలు. ఎంతో మందికి ఆమె ఇన్‌స్పిరేషన్. నాకు డిస్ట్రిబ్యూటర్‌గా ఇస్మార్ట్ శంకర్ లాంటి సక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు రొమాంటిక్ సినిమా ఇవ్వబోతోన్నారు. లైగర్‌తో బెస్ట్ ప్రొడ్యూసర్‌గా చార్మీ గారికి ఆస్కార్ అవార్డు రావాలి. రొమాంటిక్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. రొమాంటిక్ ఈజ్ పూరి సర్ ఆర్ట్ ఆఫ్ ది లైఫ్’ అని అన్నారు.

డైరెక్టర్ అనిల్ పాదూరి మాట్లాడుతూ.. ‘ఈ కథను నన్ను డైరెక్ట్ చేయమని పూరి జగన్నాథ్, ఛార్మీ గారు చెప్పారు. ఆ ఇద్దరినీ సంతృప్తిపరిస్తే చాలు అని అనుకున్నాం. ఫస్ట్ కాపీ చూశాక బాగుందని అన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు పూరి, ఛార్మీ గారికి థ్యాంక్స్. నా డెబ్యూ సినిమాగా ఆకాష్ దొరకడం నా అదృష్టం. ఆకాష్, కేతిక అద్భుతంగా నటించారు. ప్రభాస్ గారు మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఈవెంట్‌కు వచ్చి ప్రోత్సహించారు. అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

హీరోయిన్ కేతిక శర్మ మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రం ఎంతో స్పెషల్. నా మొదటి చిత్రం కాబట్టి ప్రత్యేకమని చెప్పడం లేదు. పూరి జగన్నాథ్, ఛార్మీ గారి లాంటి వారితో పని చేసే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్స్. ఆకాష్ అద్బుతంగా నటించారు. రమ్యకృష్ణ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. మా ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ సినిమా ఈవెంట్‌ను వరంగల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని నేనే చూసుకుంటాను అని చెప్పాను. సినిమా పరిశ్రమకు హైద్రాబాద్ తరువాత వరంగల్ కావాలి. ఏ సినిమాలు తీసినా ఇక్కడి నుంచే మొదలుపెట్టండి. ఇది చాలా మంచి గడ్డ. విజయ్ దేవరకొండ మా ఇంటి వాడు. వరంగల్‌కు వస్తే మా ఇంటికి తప్పకుండా వస్తాడు. హీరో ఆకాష్‌కు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది’ అని అన్నారు.

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. ఈ రెండు మూడేళ్లు ప్రాణం పెట్టి సినిమా చేశాం. ఇంతగా సపోర్ట్ చేసిన దర్శకుడు అనిల్‌కు థ్యాంక్స్. రమ్యకృష్ణ గారు ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేశారు. మా అందరికీ ఈ చిత్రం అవసరం కానీ.. ఈ సినిమాకు రమ్యకృష్ణ గారు అవసరం. కేతిక శర్మ కచ్చితంగా స్టార్ అవుతుంది. ఏ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎక్కడో నర్సీపట్నంలో పుట్టి ఇండస్ట్రీకి వచ్చాడు. కష్టపడి ఇండస్ట్రీ అనే మహాసముద్రంలోకి దూకేశాడు. ఇండస్ట్రీకి వచ్చి ఓ బస్సు కొన్నారు. అందులో మా అందరినీ అందులో పెట్టుకుని లాంగ్ జర్నీ మొదలుపెట్టారు. ఓ రాంగ్ పర్సన్ వల్ల జర్నీ ఆగిపోయింది. కానీ మా నాన్న ఒక్కడే బస్సును తోయడం మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా తోస్తూనే ఉన్నారు. మా నాన్న గురించి ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే వాళ్ల‌ని కొట్టాలని అనిపించేది. ఇక పూరి సినిమాలు ఎవరు చూస్తారు.. టైం అయిపోయిందని అందరూ అన్నారు. కానీ ఇస్మార్ట్ శంకర్‌తో ఫుల్ హై ఇచ్చారు. కెరీర్ అయిపోయింది అని అన్నవాళ్లకు నేను చెబుతున్నాను.. నీ యబ్బ కొట్టాడ్రా మా వాడు. కాలర్ ఎగిరేసే మూమెంట్ ఇచ్చినందుకు మా నాన్నకు థ్యాంక్స్. జీవితంలో సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం కాదు.. మనం చేసే పనిని ఇష్టపడటం అని మా నాన్న చెప్పారు. కానీ నా విషయంలో అది సరిపోదు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఫెయిల్ అయితే కాస్త సానుభూతి చూపిస్తారేమో. కానీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడు ఫెయిల్ అయితే మనిషిలా కూడా చూడరు. నీ కొడుగ్గా పుట్టడం నా అదృష్టం. నేను కచ్చితంగా సక్సెస్ అవుతాను. ఈడు హీరో ఏంటి..కెరీర్ అయిపోయింది అనే మాటలు విన్నాను. నేను నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం కానీ నుమ్ నా కొడుకు ఆకాష్ పూరి అని చెప్పుకునేలా చేస్తాను. ప్రతీ సినిమా మొదటి చిత్రం అనుకుని చేయమన్నావ్ కానీ ఇదే నా లాస్ట్ సినిమా అన్నట్టు చేస్తాను. ప్రాణం పెట్టి చేస్తాను. నా కెరీర్ అయిపోయిందని మాట్లాడుకున్న ప్రతీ ఒక్కరికి నేను చెబుతున్నా.. నో ఇట్స్ నాట్ ఓవర్. నిన్ను కాలర్ ఎగిరేసేలా చేస్తాను. అది ఎప్పుడు అవుతుందో చెప్పలేను. కానీ కచ్చితంగా చేస్తాను. ఇక్కడ నేను కొట్టాలి.. నువ్ కాలర్ ఎగిరెయ్యాలి. నువ్ ఇండస్ట్రీ కోసం ఎంతో ఇచ్చావ్.. నన్ను ఈ సినిమా ఇండస్ట్రీ పెంచింది. నువ్ ఎంత ఇచ్చావో నేను వన్ పర్సంట్ ఎక్కువే ఇచ్చి చస్తాను. సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా చేస్తా హిట్ అయినా ఇంకోటి చేస్తాను. నాకు ఇది తప్పా ఇంకోటి రాదు. నేను దేనికి పనికి రాను’ అని అన్నారు.

నిర్మాత ఛార్మీ మాట్లాడుతూ.. ‘ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్‌లో పెట్టాం. అది పెద్ద సక్సెస్ అయింది. అదే సెంటిమెంట్‌తో రొమాంటిక్ ఈవెంట్‌ను ఇక్కడ పెట్టాం. మా కోసం ఇంత కష్టపడి ఇక్కడకు వచ్చిన విజయ్ దేవరకొండకు థ్యాంక్స్. దర్శకుడు అనిల్‌కు థ్యాంక్స్. మళ్లీ మళ్లీ చెప్పుకునేలా పూరి గారు డైలాగ్స్ రాశారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మొన్న వరంగల్‌కి వచ్చాం.. నిన్న వచ్చాం.. మళ్లీ మళ్లీ వస్తామ’ని అన్నారు.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘మా యూనిట్ మొత్తానికి వరంగల్ అంటే సెంటిమెంట్. ఇక నుంచి ప్రతిదీ వరంగల్ లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. రొమాంటిక్ సినిమాను అనిల్ బాగా ప్రెజెంట్ చేశాడు. నేను నాలుగైదు సార్లు చూశా. ఎక్కడా బోర్ కొట్టదు. నాకు చాలా బాగా నచ్చింది. సెకండాఫ్ బాగుటుంది. క్లైమాక్స్ అయితే సూపర్. ఆకాష్, కేతిక, రమ్య ఇరగొట్టేశారు. చాలా ట్రెండీగా ఉండే సినిమా ఇది. మీకు మంచి ఎంటర్ టైన్ మెంట్ కావాలంటే ఈ సినిమా చూడండి. నేనది ప్రామిస్ చేస్తున్న. నా కొడుకు గురించి ఎక్కువ చెబితే బాగోదు. వాడు చాలా మాట్లాడాడు ఈ రోజు. వాడు చిన్నప్పటి నుంచి రోజు కళ్ళు తెరవగానే ఒకవేషం నాన్న అని అడిగేవాడు. అలా ఎన్నో ఏళ్ళు అడిడాడు. ఫైనల్ గా వాడికి వేషం వచ్చింది. నా కొడుకు ఒకటే మాట చెబుతా. వీడు వెరీ గుడ్ యాక్టర్. ఇక కేతిక, ఢిల్లీ నుంచి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి అందగత్తె మాత్రమే కాదు మంచి పాటలు పాడుతుంది. రమ్యకృష్ణ గారి వల్ల ఈ సినిమా జాతకం మారిపోయింది. ఈ సినిమాకు పని చేసిన వారంతా బాగా చేశారు. అందరికీ థాంక్స్. ముఖ్యంగా ఛార్మి. నా స్ట్రెంగ్త్. నాకు ఏ టెన్షన్ రాకుండా అన్నీ చూసుకుంటుంది ఆమె. థాంక్యూ ఛార్మి. లవ్ యూ ఆల్. మళ్ళీ అందరం 29న మీ అందరితో సినిమా చూడాలని అనుకుంటున్నాం. ఈ సినిమా ట్రైలర్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. డార్లింగ్ కి నేను థాంక్స్ చెబుతున్న. అలాగే మా లైగర్ విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసి నేనే షాకవుతున్నా. ఈ సినిమా కోసం మీరే కాదు నేను కూడా వెయిట్ చేస్తున్నా. థాంక్యూ విజయ్’ అని అన్నారు..

- Advertisement -