రాధే శ్యామ్…టీజర్ డేట్ ఫిక్స్‌

124
prabhas
- Advertisement -

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం 2022 జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుండగా తాజాగా సినిమా గురించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది.

స్వయంగా సినిమా టీజర్‌ డేట్‌ని ప్రకటించారు ప్రభాస్. అక్టోబర్ 23 న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విక్రమాదిత్య ఎవరు? అక్టోబర్ 23 న ‘రాధేశ్యామ్’ టీజర్ గురించి తెలుసుకోవడానికి వేచి ఉండండి అని పేర్కొన్నారు. టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు భాషల్లో ఉపశీర్షికలతో ఆస్వాదించండి,#GlobalPrabhasDay అనే వైరల్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ ఇటలీ నేపథ్యంలో రూపొందింది. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

- Advertisement -