వీవోఏల జీతాలు పెంపు…

269
VOA Salaries Hiked By CM KCR
- Advertisement -

గ్రామీణ స్థాయిలో పని చేసే ఉద్యోగుల పట్ల  సానుకూలంగా వ్యవహారిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొన్న వీఆర్‌ఏలకు, నిన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు, ఇవాల వీవోఏ(విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు)లకు జీతాలు పెంచుతు నిర్ణయం తీసుకున్నారు సీఎం.  ప్రగతి భవన్‌లో వీవోఏలతో సమావేశమైన కేసీఆర్ నెలకు రూ. 5 వేల జీతం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వీవోఏలకు  గ్రామైక్య సంఘాలు రూ. 2 వేలు, ప్రభుత్వం రూ. 3 వేలు చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వం వాటాను సెర్ప్ ద్వారా చెల్లిస్తుందని తెలిపారు.  గ్రామైక్య సంఘాల వాటాను చెల్లించే బాధ్యత సూపర్ వైజర్లు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో 18,405 మంది వీవోఏలు ప్రయోజనం పొందుతారన్నారు సీఎం. జీతం సరిపోవడం లేదని ఎప్పటి నుంచో వీవోఏలు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. వారికి ఇప్పటి వరకు కేవలం 500 నుంచి 1500వరకు మాత్రమే వేతనాలు అందేయన్నారు.

సమైక్య రాష్ట్రంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని కానీ తెలంగాణలో ఆ పరిస్ధితి మారాలన్నారు సీఎం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవ్వాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు బాగా నడుస్తున్నాయని మంచిపేరు వచ్చిందని ఈ సందర్భంగా సీఎం వారికి తెలిపారు. డ్వాక్రా మహిళలకు అవసరమైన చేయూత నందిస్తామని … ఇతర రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మహిళా సంఘాల పనితీరుపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వీవోఏలకు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -