- Advertisement -
హర్ష పులిపాక దర్శకత్వంలో బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ నటిస్తున్న చిత్రం పంచతంత్రం. ఇవి మీ కథలు ,మన కథలు అనే ట్యాగ్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.
అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక నాలుగో జీవనాధారం కోసం ఓ చోటులో కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు, చిరుత పెట్టిన పరుగుల కథలు, ఈగ చెప్పే బాహుబలి కథలు వినడానికి వచ్చిన వాటికి ఒక ముసలి తాబేలు కన్పించింది. కదలడానికి కష్టపడే నువ్వేం కథలు చెబుతావని అడగ్గా, జవాబగునా ఆకాశం అంత అనుభవంతో కథలు మొదలయ్యాయి అంటూ సాగే వాయిస్ సూపర్బ్‌గా ఉంది.ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి..
- Advertisement -