గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న ప్రొ. శాంతా సిన్హా

208
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ మణికొండ విసిరిన చాలెంజ్ స్వీకరించి వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటారు సామాజిక సేవకురాలు పద్మశ్రీ,రామన్ మెగాసేసే అవార్డ్ గ్రహీత ప్రో.శాంతా సిన్హా

.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాంత సిన్హా మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగాలి అని ఆకాక్షించారు.మానవాళికి చెట్లు ఎంతో అవసరం వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని గుర్తుచేశారు.ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు నా వంతు కృషి చేసాను ప్రతి ఒక్కరు మొక్కలు నాటి గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టేందుకు కృషి చేయాలి అని పిలుపుచ్చారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రొఫెసర్ శాంతా సిన్హా అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం సఫలీకృతం కావాలని ఆకాక్షించారు. కార్యక్రమం అనంతరం ప్రొఫెసర్ శాంతా సిన్హా కి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ రాఘవ.

- Advertisement -