మరింత ముందుకు బన్నీ…పుష్ప!

72
pushpa
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతుండగా తొలిపార్టు తొలుత క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వస్తుందని ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా డిసెంబర్ 17న విడుదల కానున్నట్లు సమాచారం.

దీనిపై త్వరలోనే మేకర్స్ అఫిషియల్‌ అనౌన్స్ మెంట్ చేయనున్నారు. ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. రష్మిక శ్రీవల్లి అనే గూడెం అమ్మాయి గా నటించబోతోంది. పుష్పరాజ్ సతీమణిగా శ్రీవల్లి పాత్ర ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుందని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. మొత్తంగా పుష్ప రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -