కొత్త జిల్లాల కుదింపు వట్టిదే….

240
Telangana new districts rumours
- Advertisement -

రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత పగడ్బందీగా అందించడం కోసం ప్రభుత్వం కొత్తగా జిల్లాలను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కొత్తగా 21 జిల్లాలతో కలిపి 31 జిల్లాతో ప్రస్తుతం పాలన సాగుతోంది. అయితే, కొత్తగా ఏర్పాటుచేసిన 21 జిల్లాలపై వస్తున్న ఊహాగానాలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న 31 జిల్లాలను కుదించాలని రాష్ర్టానికి లేఖ రాసినట్లు వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని తెలిపింది.

ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి కొత్త జిల్లాల సంఖ్యను కుదించాల్సిందిగా ఎలాంటి లేఖను పంపలేదని కేంద్ర హోంమంత్రిత్వశాఖలోని కేంద్ర-రాష్ట్ర సంబంధాల విభాగం(సీ-ఎస్), రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ (ఎస్‌ఆర్) విభాగాలకు చెందిన అధికారులు స్పష్టం చేశారు.

ఇదిఇలా ఉండగా రెండు రోజులుగా కొత్తజిల్లాల కుదింపుపై సోషల్ మీడియలో వార్త విస్తృతంగా వైరల్ అవుతోంద. 31 జిల్లాలను కుదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు వార్త చక్కర్లు కొట్టింది. అంతేగాదు ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలకుగాను 21 జిల్లాలుగా కుదించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

అధిక జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా ఒకేసారి అంతమంది కేంద్ర సర్వీసు అధికారులను కేటాయించడం కష్టమని తేల్చిచెప్పినట్లు … కొత్త జిల్లాలకు ఐఎఎస్, ఐపిఎస్ లతోపాటు ఇతర కేంద్ర సర్వీసు అధికారులను కేటాయించడం అసాధ్యమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు ఆ వార్త సారాంశం.  దీంతో ఈ రాద్దాంతంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం తెలంగాణలో జిల్లాల కుదింపు రూమర్లేనని స్పష్టం చేసింది.

- Advertisement -