రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు మరోసారి జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి అంగన్‌వాడీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. ఏ ప్రభుత్వాలు చేయనటువంటి అభివృద్ధి పనులను సీఎం చేస్తున్నారని కొనియాడారు.
బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తామన్నారు. మమ్మల్ని కేసీఆర్ పిలిచి మరీ మా సమస్యలు పరిష్కరించారని తెలిపారు. దీంతో సీఎం మహిళల పక్షపాతి అని మరోసారి నిరూపితమైందన్నారు. మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆశించిన దాని కంటే ఎక్కువనే జీతాలు పెంచారని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రగతి భవన్‌లో అంగన్‌వాడీల సమస్యలపై సీఎం కేసీఆర్ వారితో ముఖాముఖిగా చర్చించిన విషయం విదితమే. అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ. 10,500, సహాయకులకు రూ. 6,000 జీతాలు పెంచుతామమని సీఎం ప్రకటించారు.