- Advertisement -
టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై విజయ్ తండ్రి గోవర్ధనరావు దేవరకొండ, విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దామోదర దర్శకుడు. ఇదివరకు విడుదలైన ‘పుష్పక విమానం’ ఫస్ట్ లుక్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని ‘కల్యాణం కమనీయం’ పాట ఇప్పటికే సూపర్ హిట్టయి సినిమాకు ఆకర్షణగా నిలిచింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘పుష్పక విమానం’ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
- Advertisement -