89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లాస్ ఏంజిల్స్‌లో అత్యంత వైభవంగా జరిగింది. హలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ, మహారథులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. విభిన్న వస్త్రధారణతో తారలు రెడ్ కార్పెట్‌పై హొయలు పోతూ నడిచి రావడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ నటి ప్రియాంక చోప్రా తనదైన వస్త్రధారణతో తళుక్కున మెరిశారు.
89వ ఆస్కార్ అవార్డులకు ఎంపికైనది వీరే!
*ఉత్తమ చిత్రం: మూన్లైట్
* ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా ల్యాండ్)
* ఉత్తమ నటుడు: కసే ఎఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ)
* ఉత్తమ దర్శకుడు: డేమియన్ చాజెల్ (లా లా ల్యాండ్)
* అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: మూన్లైట్ (బ్యారీ జెన్కిన్స్, టరెల్ అల్విన్ మెక్క్రనే)
* ఉత్తమ స్క్రీన్‌ప్లే: మాంచెస్టర్ బై ద సీ(కెన్నత్ లొనెర్గాన్)
* ఉత్తమ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్(లా లా ల్యాండ్)
* ఉత్తమ ఒరిజినల్ స్కోర్: లా లా ల్యాండ్
*ఉత్తమ ఛాయాగ్రహణం: లాలా ల్యాండ్( లినస్ శాన్గ్రెన్)
* ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్(క్రిస్టఫ్ డీక్, అన్నా యుడ్వర్డీ)
* ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రం: ద వైట్ హెల్మెట్స్(ఓర్లాండో వోన్ ఇన్సీడెల్, జోన్నా నటసెగర)
* ఉత్తమ ఎడిటింగ్: హాక్సా రిడ్జ్(జాన్ గిల్బర్ట్)
* ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: ద జంగిల్ బుక్ (రాబర్ట్ లిగాటో, ఆడమ్ వాల్డెజ్, ఆండ్ర్యూ ఆర్. జాన్స్, డ్యాన్ లెమన్)
* ప్రొడక్షన్ డిజైన్: లాలా ల్యాండ్(డేవిడ్ వాస్కో, శాండీ రేనాల్డ్స్)
* యానిమేటెడ్ లఘు చిత్రం: పైపర్(అలాన్ సరిల్లరో, మార్క్ సన్డెల్మెర్)
* యానిమేటెడ్ ఫీచర్ చిత్రం: జూటోపియా(బైరాన్ హోవర్డ్, రిచ్ మూరే, క్లార్క్ స్పెన్సర్)
* ఉత్తమ విదేశీచిత్రం: సేల్స్‌మ్యాన్(ఇరాన్)
* ఉత్తమ సహాయనటి: వయోలా డేవిస్(ఫెన్సెస్)
* సౌండ్ మిక్సింగ్: హాక్సా రిడ్జ్
* సౌండ్ ఎడిటింగ్: అరైవల్(బెల్లీమార్)
* ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: ఒ.జె. మేడ్ ఇన్ అమెరికా(ఎజ్రా ఎడిల్మ్యాన్, కరోలైన్ వాటర్‌లో)
* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫెంటాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టూ ఫైండ్ ధెమ్(కొలెన్ ఎట్ఉడ్)
* ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ: సుసైడ్ స్క్వాడ్ ( అల్సాండ్రో బెర్టాల్జీ, జిర్జోయో గెగ్రేరియన్, క్రిస్టోఫర్ నీల్సన్)
* ఉత్తమ సహాయనటుడు: మహేర్షల అలీ(మూన్లైట్)