సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రావాలంటే హీరోయిన్స్ ఎలా ఉండాలో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే హీరోయిన్లకి గ్లామరే ఆఫర్లు తెచ్చే దారి అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ గ్లామర్ ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, చూపించాలన్నది తెలుసుకుంటే కొంతకాలం వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. ఇప్పుడు ‘అను ఇమ్మాన్యుయెల్’ కూడా ఇదే విషయాన్ని ప్రాక్టికల్ గా చేసిచూపిస్తున్నట్లుంది. ఈ అమ్మడు కూడా గ్లమర్ విషయంలో ఎలాంటి కండీషన్స్ లేకుండా అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలాగే కనిపిస్తోంది.
ఈ అమ్మడి గురించి చెప్పాలంటే..చాలా చిన్న వయసులోనే హీరోయిన్ అయిపోయింది ఈ మలయాళ కుట్టి. ఒక సినిమాలో స్కూల్ అమ్మాయిగా కనిపించిన ఈ అమ్మడు, ఆ తర్వాత నివిన్ పౌలీ సరసన కథానాయిక అవతారమెత్తింది. ఇక తెలుగు ప్రేక్షకులకు అను ‘మజ్ను’ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ చాలా పద్ధతిగా కనిపించింది. ఐతే ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో కష్టమనుకుందో ఏమో.. ఉన్నట్లుండి గ్లామర్ డోస్ పెంచేస్తోంది అను.
ఇక ఈ అమ్మడు నటిస్తున్న తాజా సినిమా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’. ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో కలిసి లిప్ లాక్ లాగించేసింది ఈ భామ. మజ్నులో పద్దతిగా కనిపించిన అను.. ఈ సినిమాతో తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టింది. ఈ సినిమాలో ఈ చిన్నది చాలా గ్లామరస్ గా కనిపించబోతోందని ప్రోమోలు చూస్తేనే అర్థమవుతోంది.
అంతేకాకుండా ఈ చిత్ర ప్రమోషన్లలోనూ అమ్మడు రెచ్చిపోతోంది. నిన్న ఈ సినిమా గుమ్మడికాయ ఫంక్షన్లో అను మతి పోగొట్టేసింది. క్లీవేజ్ అందాలతో ఆ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అను. ఆమె తీరు చూస్తుంటే గ్లామర్ రోల్స్ కు తాను ఎంత మాత్రం అడ్డు చెప్పబోనని సిగ్నల్స్ ఇస్తున్నట్లుగా ఉంది. ఈ చొరవ చూస్తుంటే తెలుగులో అను మున్ముందు బాగా బిజీ అయిపోయేలా కూడా కనిపిస్తోంది.