తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అభినంధించారు. ఇప్పటికే ప్రజల్లో చైతన్యాన్ని నింపే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, తన పని తనాన్ని మరోసారి చాటుంకుంది. సోషల్ మీడియాలో ప్రజలతో అందుబాటులో ఉండేలా ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో పొల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే మన్ కీ బాత్ కార్యక్రంలో పాల్గొన్న మోదీ తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
స్వచ్ఛ భారత్, టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ దూసుకెళ్తుందని, తెలంగాణలో స్వచ్ఛ భారత్ అమలు చేస్తున్న తీరు అద్భుతమని ప్రశసించారు మోదీ. అంతేకాకుండా అందరం కలిస్తేనే స్వచ్ఛ భారత్ సాధ్యమవుతుందన్నారు. అలాగే తెలంగాణలో టాయిలెట్ల నిర్మాణం కూడా భేష్ అన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామీణాభివృద్ధి శాఖ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమంలో 23 రాష్ర్టాల నుంచి సీనియర్ అధికారులు పాల్గొన్నారని కూడా వెల్లడించారు. స్వఛ్చభారత్ కార్యక్రమంలో భాగంగా గంగదేవిపల్లిలో ప్రతి ఇంట్లో స్వచ్ఛత పాటిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నెల 17, 18న హైదరాబాద్‌లో మరుగుదొడ్ల శుభ్రత కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. మరుగుదొడ్ల శుభ్రత కార్యక్రమంలో అధికారులు స్వయంగా పొల్గొన్నారని తెలిపారు ప్రధాని. ఇలా మరుగుదొడ్ల శుభ్రతలో అధికారులు కూడా పాల్గొంటే ప్రజలు ఎంతో ప్రభావితులవుతారని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా స్వచ్ఛత, శుభ్రత కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగిందంటూ… స్వచ్ఛ భారత్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఇలా స్వచ్ఛతపై అవగాహన కల్పనకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు.