భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు.పారాలింపిక్స్‌లో భారత్‌కు పసిడి పతకాల పంట పండుతున్నది. ఈ పారాలింపిక్స్‌లో ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా మరో ఆటగాడికి స్వర్ణం దక్కింది.
శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో షట్లర్ ప్రమోద్ భగత్ ఘన విజయం సాధించాడు. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌ను 21-14, 21-17 తేడాతో రెండు వరుస సెట్లలో ఓడించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. మొత్తం పతకాల సంఖ్య 16కు చేరింది.