తెలంగాణలో కొత్తగా 313 కరోనా కేసులు నమోదు..

144
- Advertisement -

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,304 కరోనా పరీక్షలు నిర్వహించగా 313 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 77 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 28, కరీంనగర్ జిల్లాలో 21 కేసులు గుర్తించారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 354 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,58,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,49,002 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,809 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,878కి పెరిగింది.

- Advertisement -