ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్

82
ichata
- Advertisement -

సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స్టార్ రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో సుశాంత్‌, హీరోయిన్ మీనాక్షి చౌద‌రి, నిర్మాత హ‌రీశ్‌, డైలాగ్ రైట‌ర్ సాయిబాబా, అభిన‌వ్ గోమ‌టం, సినిమాటోగ్రాఫ‌ర్ సుకుమార్‌, పాట‌ల ర‌చ‌యిత శ్రీనివాస్ మౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, అవసరాల శ్రీనివాస్, వి.ఎన్.ఆదిత్య, జెమినీ కిరణ్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రోల్ రైడా, ఎడిటర్ గ్యారీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ఇండియాలోనే కాదు, ప్ర‌పంచం మొత్తం మీద థియేట‌ర్‌కు రావ‌డానికి సాహ‌సిస్తున్న జాతి.. తెలుగు జాతి మాత్ర‌మే. ఏమీ భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు. మంచి కంటెంట్ క్రియేట్ చేసి మ‌రింత ముందుకు వెళ్దాం. ఈ సినిమా చేయ‌బోతున్న‌ట్లు అల వైకుంఠ‌పుర‌ములో షూటింగ్ టైమ్‌లోనే సుశాంత్ చెప్పాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని నేను కూడా బ‌య‌ట వింటున్నాను. సుశాంత్ త‌న‌కు తెలియ‌కుండా ఓ చ‌ట్రంలో ఇరుక్కుపోయాడ‌ని అనుకునేవాడిని. అయితే నాకు తెలిసి చి.ల‌.సౌ సినిమాతో త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకునే ప‌నిలో ప‌డ్డాడు. ఆ సినిమా చూసే త‌న‌ని నా అల వైకుంఠ‌పుర‌ములో యాక్ట్ చేయ‌మ‌ని అడిగాను. ఇప్పుడు త‌న హ్యాట్రిక్ మూవీ ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు. ఈ సినిమాతో ప్రొడ్యూస‌ర్ నుంచి గ‌వ‌ర్న‌మెంట్‌కు బోల్డెంత ట్యాక్స్ క‌ట్టించాలి. డైరెక్ట‌ర్ ద‌ర్శ‌న్‌.. ఫస్ట్ మూవీ ఎలా ఉంటుందో తెలుసు. ఓ సినిమాను మిక్సింగ్ చేసి వ‌దిలేస్తుంటే మ‌నింటి ఆడపిల్ల‌ను ఎవ‌రికో ఇచ్చేసి పంపిచేస్తున్న‌ట్లుగా ఉంటుంది. అందులో ఫ‌స్ట్ మూవీ అనేస‌రికి ఇంకా బాధ‌గా ఉంటుంది. కాకుంటే ఆడపిల్ల వెళ్లి సెప‌రేట్ ఎస్టాబ్లిష్ ఎలా చేస్తుంద‌నే ఆనందంగా పంపిస్తామో, సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని, ప్ర‌జ‌ల జీవితాల్లోకి వెళ్లిపోయి. థియేట‌ర్స్‌లో, టీవీల్లో, మొబైల్ ఫోన్స్‌లో, కామెడీ సీన్స్‌లో, సాంగ్స్‌లో, షోస్‌లో దానికి తాలుకు శ‌బ్దం వినిపిస్తున్న‌ప్పుడు, దాని జీవితం తాలుకు స్పాన్ పెరుగుతున్న‌ప్పుడు మ‌న‌కు మ‌రింత ఆనందంగా, గ‌ర్వంగా, ఉత్సాహంగానూ ఉంటుంది. అలాంటి రోజులు మ‌రిన్ని ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌కు రావాల‌ని కోరుకుంటున్నాను. ప్రవీణ్ ల‌క్క‌రాజు మ్యూజిక్ బాగా న‌చ్చింది. యాక్ట‌ర్ వెంక‌ట్.. ట్రూ హైద‌రాబాదీ. నేను హైద‌రాబాద్ వ‌చ్చిన కొత్త‌ల్లో ఈయ‌న న‌టించిన సీతారాముల క‌ళ్యాణం చూత‌మురారండి సినిమా చూశాను. నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్ అభిన‌వ గోమ‌టం, మీనాక్షి చౌద‌రి ఆల్ ది బెస్ట్‌. ప్రియ‌ద‌ర్శిని పెళ్లిచూపుల నుంచి చూస్తున్నాను. సిన్సియ‌ర్ యాక్ట‌ర్‌. ఇలా అంద‌రికీ అభినంద‌న‌లు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ ‘‘మా సినిమా ప్రమోషన్స్ ప్రభాసన్న విడుదల చేసిన టీజర్‌తో స్టార్ట్ అయ్యింది. త‌ర్వాత స‌మంత‌, వ‌రుణ్‌, చైత‌న్య సాంగ్స్‌ను, చిన్న‌మామ‌(నాగార్జున‌) ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అంద‌రూ మాకు కావాల్సిన బూస్ట్ ఇచ్చారు. అంద‌రికీ పేరు పేరునా థాంక్స్‌. త్రివిక్ర‌మ్‌గారు చాలా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నేను అడిగాన‌ని వ‌చ్చాడు. నేను తొలి మూడు నాలుగు సినిమాలను లెక్క‌లు వేసుకుని చేశాను. అంద‌రం క‌ష్ట‌ప‌డే చేశాం. అయితే అంత క్లారిటీ లేక‌పోయింది. చి.ల‌.సౌ స‌మ‌యంలో నాగార్జున మామ‌య్య న‌న్ను పిలిచి సినిమా ఆడినా, ఆడ‌క‌పోయినా ఇండిపెండెంట్‌గా ఆలోచించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. కొత్త హీరోలా ఆలోచించి రాహుల్‌తో క‌లిసి కొత్త జ‌ర్నీలా స్టార్ట్ చేశాం. ఆ సినిమా చేసిన‌ప్పుడు నేను ఊహించ‌లేదు కూడా. ఆ టైమ్‌లో నన్ను న‌మ్మి సినిమా చేసిన నిర్మాత‌ల‌కు థాంక్స్‌. రాహుల్ సినిమాను చైత‌న్య‌, స‌మంత‌ల‌కు చూపించాడు. చైత‌న్య‌కు సినిమా న‌చ్చింది. చైత‌న్య ఆ సినిమాను నాగార్జున‌కు చూపించాడు. ఆయ‌న న‌చ్చ‌డంతో ఆయ‌న పార్ట్‌న‌ర్‌గా మారి సినిమా రిలీజ్ చేశారు. అక్క‌డి నుంచి ఇండిపెండెంట్‌గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం స్టార్ట్ చేశాను. అల వైకుంఠ‌పుర‌ములో సినిమాను త్రివిక్ర‌మ్‌గారు అడ‌గ్గానే ఏమీ ఆలోచించ‌కుండా చేస్తాన‌ని అన్నాను. అందుకు కార‌ణం అక్క‌డ బ‌న్నీ, ట‌బుగారు ఇలా అంద‌రూ ఉంటారు. ఏదైనా నేర్చుకోవ‌చ్చున‌ని నా ఫీలింగ్‌. అక్క‌డ నుంచి కొత్త మూమెంట్ స్టార్ట్ అయ్యింది. ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమా విష‌యానికి వ‌స్తే డైరెక్ట‌ర్ ద‌ర్శ‌న్‌ను హ‌రీశ్ ద్వారా సాగ‌ర్‌గారు నాకు ప‌రిచ‌యం చేశారు. క‌థ న‌చ్చింది. అయితే అప్ప‌టికే ఆ క‌థ‌కు అడ్వాన్స్ ఇచ్చిన నిరంజ‌న్ రెడ్డిగారు, నేను రిక్వెస్ట్ చేయ‌డంతో, నీకు బావుంటుంది చేయ‌మ‌ని అన్నాడు. శ్రీనివాస్ అవ‌స‌రాల క‌థ విని కొన్ని చిన్న చిన్న స‌ల‌హాలు ఇచ్చాడు. హ‌రీశ్ ఇత‌ర స్నేహితులు ఎంతో స‌పోర్ట్ చేశారు. ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. చి.ల‌.సౌకు వ‌ర్క్ చేసిన సుకుమారన్‌గారు ఈ సినిమాకు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు ర‌విశంక‌ర్ శాస్త్రిగారు, ఏక్తా శాస్త్రిగారు బ్యాక్‌బోన్‌లా నిల‌బ‌డ్డారు. పెద్ద స్టార్‌ను కాదు, కొత్త హీరోయిన్‌, డెబ్యూ డైరెక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ, మాపై న‌మ్మ‌కంతో ఎక్క‌డ ఖ‌ర్చు పెట్టాలో అక్క‌డ ఖ‌ర్చు పెడుతూ సినిమా చేశారు. ఓటీటీ ఆఫ‌ర్స్ కూడా వ‌చ్చాయి. కానీ నిర్మాత‌లు థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకు ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రిగారు అందించిన స‌పోర్ట్‌కు థాంక్స్‌. ప్రవీణ్ ల‌క్క‌రాజు అమేజింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. త‌ను భవిష్య‌త్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడు. ద‌ర్శ‌న్ ఈ క‌థ‌ను చెప్ప‌డానికి ముందు మ‌రో క‌థ‌ను చెప్పాడు. డార్క్ క‌థ కావ‌డంతో నిరంజ‌న్‌గారి ప‌ర్మిష‌న్‌తో ఈ సినిమా చేశాం. నిజ ఘ‌ట‌న ఆధారంగా చేసుకుని చేసిన సినిమా. నా పాత్ర‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. చాలా ఓపెనెప్ అయ్యి ఈ సినిమా చూశాను. ఇలాంటి పాత్ర‌ను నాకు ఇచ్చిన ద‌ర్శ‌న్‌కు థాంక్స్‌. కొత్త సుశాంత్‌ను ద‌ర్శ‌న్ చూపించాడు. హ‌రీశ్ నా సినిమాకు నిర్మాతే కాదు, మంచి స్నేహితుడు కూడా. చి.ల‌.సౌకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్న హ‌రీశ్‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాకు నిర్మాత‌గా మారాడు. మ‌మ్మ‌ల్నంద‌రినీ క‌లిపి సినిమా చేశాడు. ముంబైలో వ‌ర్కింగ్ షాప్‌లో మీనాక్షి చౌద‌రిని క‌లిశాను. అప్పుడు ఈ సినిమాలో చేయ‌మ‌ని అడిగాను. పెర్ఫామెన్స్ రోల్ అది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే మీనాక్షి చౌద‌రి చాలా బిజీగా మారిపోయింది. త‌ను ఇంకా బిజీ హీరోయిన్‌గా మారాలి. గ్యారీ సినిమాను అద్భుతంగా ఎడిట్ చేశాడు. సురేశ్‌బాబా, భాస్క‌ర్ చాలా క‌నెక్టింగ్ డైలాగ్స్ రాశారు. కృష్ణ చైత‌న్య చాలా మంచి పాత్ర చేశాడు. వెంక‌ట్‌గారు నాకు ఎప్ప‌టి నుంచో తెలుసు. తాత‌గారితో క‌లిసి ప‌నిచేశారు. వెంక‌ట్‌గారు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. అలాగే ఈ సినిమాలో అభిన‌వ్‌ను చాలా కొత్త‌గా క‌నిపిస్తాడు. ఇక ప్రియ‌ద‌ర్శి చాలా ఇంపాక్ట్ రోల్ చేశాడు. వెన్నెల‌కిషోర్‌గారు బిజీగా ఉన్నా డేట్స్ అడ్జ‌స్ట్ చేసి సినిమా చేశాడు. ఈ సినిమా కాన్సెప్ట్ బేస్డ్. కానీ ఎంట‌ర్‌టైనింగ్‌గా చేశాం. త‌ప్ప‌కుండా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను సాలిడ్‌గా ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌ని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు.

నిర్మాత రవి శంకర్ శాస్త్రి మాట్లాడుతూ ‘‘మా టీమ్ కోసం వ‌చ్చిన త్రివిక్ర‌మ్‌గారికి థాంక్స్‌. పెద్ద‌మ్మమ్మ‌గారితో ఉండే అనుబంధం కార‌ణంగా నాకు చిన్న‌ప్పుడు సినీ ఇండ‌స్ట్రీతో ప‌రిచయం ఉండింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాను. అయితే మంచి స‌పోర్ట్ దొరికింది. సుశాంత్ అంద‌గాడే కాదు, తెలివైనవాడు, బాగా క‌ష్ట‌ప‌డ‌తాడు. త‌న ఎఫ‌ర్ట్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఆగ‌స్ట్ 27న విడుద‌లవుతున్న మా ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాను స‌క్సెస్ చేయాలి’’ అన్నారు.నిర్మాతఏక్తా శాస్త్రి మాట్లాడుతూ ‘‘త్రివిక్రమ్‌గారికి థాంక్స్‌. సుశాంత్‌, ద‌ర్శ‌న్‌, మీనాక్షి స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు. ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌వుతున్న సినిమాను అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు ఎస్‌.ద‌ర్శ‌న్ మాట్లాడుతూ ‘‘ఎన్నో ఏళ్ల క‌ల నేర‌వేరిన రోజుది. నాకు అండ‌గా నిల‌బ‌డిన కుటుంబ స‌భ్యుల‌కు థాంక్స్‌. 2010లో నాకు, నా స్నేహితుడికి ఎదురైన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాను. ఢ‌మ‌రుకం సినిమా చేసే స‌మ‌యంలో నా తోటి అసిస్టెంట్స్‌కు చెబితే సినిమాగా చేస్తే బాగుంటుంద‌ని వాళ్లు స‌ల‌హా ఇచ్చారు. దాంతో అప్ప‌టి నుంచి ఈ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాను. 2013లో క‌థ పూర్త‌య్యింది. చాలా మంది ఈ క‌థ విన్నారు. ఈ క‌థ ఎప్పుడు సినిమాగా వ‌స్తుందోన‌నే క్యూరియాసిటీ ఎక్కువ‌గా ఉండేది. చివ‌ర‌కు సుశాంత్‌గారితో సినిమా చేశాను. ఈ సినిమా చేయ‌డానికి కార‌ణం.. నా స్నేహితులు అభిన‌వ్ గోమ‌టం, ప్రియ‌ద‌ర్శి. వాళ్లు ఇచ్చిన ఎంక‌రేజ్‌మెంట్‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ముందుగా గ్యారీకి ఈ క‌థ చెబితే, త‌ను న‌న్ను నిరంజ‌న్ రెడ్డిగారికి ప‌రిచ‌యం చేశారు. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చింది. ఆయ‌న సినిమా చేస్తాన‌ని అన్నారు. కానీ ఆయ‌న‌కున్న క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా, సినిమా వాయిదా ప‌డింది. అప్పుడు మ‌రో క‌థ‌ను రెడీ చేసుకుని మ‌ళ్లీ మ‌రో సినిమా కోసం ట్ర‌య‌ల్స్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు డైరెక్ట‌ర్ సాగ‌ర్ ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న సుశాంత్‌గారితో సినిమా చేద్దామ‌ని, హ‌రీశ్‌గారికి ప‌రిచ‌యం చేశారు. నేను చెప్పిన సుశాంత్‌గారికి న‌చ్చింది. అయితే, ఆయ‌న మ‌రో క‌థ‌తో సినిమా చేద్దామ‌ని అన్నారు. అప్పుడు నిరంజ‌న్ రెడ్డిగారికి క‌థ చెప్పాన‌ని, ఆ క‌థ మీకు చెప్ప‌లేన‌ని అన్నాను. అప్పుడు సుశాంత్‌గారు నిరంజ‌న్ రెడ్డిగారితో మాట్లాడి ఒప్పించారు. త‌ర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ క్ర‌మంలో నాకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. శ్రీనివాస‌రెడ్డిగారు నాన్న‌లాగా న‌న్ను ముందుండి న‌డిపించారు. కూల్‌గా ఎలా ప‌నిచేయాల‌నే విష‌యాన్ని ఆయ‌న ద‌గ్గ‌ర నుంచే నేర్చుకున్నాను. త‌మిళ ఇండ‌స్ట్రీలో రైట‌ర్‌, డైరెక్ట‌ర్ అయిన మా నాన్న‌గారి నుంచి స్క్రిప్ట్ నేర్చుకున్నాను. ఆయ‌న‌కు సాధార‌ణంగా నేను చెప్పిన క‌థ‌లేవీ న‌చ్చ‌లేదు. అలాంటాయ‌న‌కు ఈ క‌థ బాగా న‌చ్చింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు అద్భుత‌మైన సంగీతాన్నే కాదు.. షాకింగ్ రీరికార్డింగ్ అందించాడు. సుకుమార‌న్‌గారితో వ‌ర్క్ చేయాల‌ని అనుకున్నాను. ఆయ‌న‌తో నా తొలి సినిమా చేయ‌డం ల‌క్‌. ఆయ‌న వ‌ల్లే ఈసినిమా ఇంత అద్భుతంగా వ‌చ్చింది. గ్యారీ గ్రేట్ ఎడిట‌ర్‌. సాయిబాబా, భాస్క‌ర్ మాట‌ల‌తో సినిమాకు ప్రాణం పోశారు. ప్ర‌తి ఒక్క‌రూ వారి ప‌నిని ప్రేమించి చేయ‌డంతో సినిమా అద్భుతంగా వ‌చ్చింది. కృష్ణ‌చైత‌న్య న‌టుడిగా నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ‌తాడు. యాక్ట‌ర్ వెంక‌ట్‌గారు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆయ‌న‌కు థాంక్స్‌. ఇక సినిమా నిర్మాత‌లు ర‌విశంక‌ర్‌గారు, ఏక్తా మేడ‌మ్‌, హ‌రీశ్‌గారు.. వాళ్ల ఫ్యామిలీ మెంబ‌ర్‌లా ట్రీట్ చేసి ఇంకా బెస్ట్‌గా చేద్దామ‌ని స‌పోర్ట్ చేశారు. రెండు లాక్‌డౌన్స్ ఫేస్ చేశాం. ఓటీటీ ఆఫ‌ర్స్ వ‌చ్చినా సుశాంత్‌గారు, నిర్మాత‌లు థియేట‌ర్స్‌లోనే సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకుని అండ‌గా నిల‌బ‌డ్డారు. మీనాక్షి తొలి సినిమానే అయినా, త‌న క్యారెక్ట‌ర్‌లో ఇన్‌వాల్వ్ అయ్యి చేసింది. త‌ను హీరోయిన్‌గా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంటుంది. ఇక నా సినిమా హీరో సుశాంత్‌గారి చెప్పాలంటే ఎమోష‌న్‌గా ఉంది. క‌థ విన‌గానే నేను చేస్తాన‌ని అన్న‌మాట‌ను నిల‌బెట్టుకున్నారు. మ‌రో క‌థ‌ను కూడా విన‌లేదు. ఈ సినిమాలో త‌నను చాలా కొత్త‌గా చూస్తారు. చాలా ఎఫ‌ర్ట్ పెట్టి చేస్తారు. ఆయ‌న వ‌ల్లే సినిమా జ‌రిగిన‌న్ని రోజులు స్మూత్‌గా సాగిపోయింది. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోని ఈ మూవీలో చాలా లేయ‌ర్స్ ఉన్నాయి. సినిమా క‌చ్చితంగా అంద‌ర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ ‘‘మా సినిమా నిర్మాతలకు థాంక్స్. గీతాంజలి, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల త‌ర్వాత నాకు కాస్త గ్యాప్ వ‌చ్చింది. మ‌ళ్లీ సినిమాలు చేయాల‌నుకుంటున్న స‌మ‌యంలో హ‌రీశ్‌గారి ద్వారా సుశాంత్‌ను క‌లిశాను. ఆయ‌న నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. నా పాట‌ల ర‌చ‌యిత‌కు, రోల్ రైడాకు థాంక్స్‌. ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌తో చాలా మంచి జర్నీ. చాలా మంచి అవుట్‌పుట్ రాబ‌ట్టుకున్నాడు. త‌న‌కు మంచి మ్యూజిక‌ల్ సెన్స్ ఉంది. త‌ను భ‌విష్య‌త్తులో పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడు. ఈ జ‌ర్నీలో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

నిర్మాత హ‌రీశ్ మాట్లాడుతూ ‘‘రవిశంకర శాస్త్రిగారు, ఏక్తాగారు, సుశాంత్‌గారి లెగ‌సీస్ ఏంటో తెలుసు. అలాంటి వాళ్లు చేసే సినిమాలో నేను భాగం కావ‌డం అనేది చాలా గౌర‌వంగా, అదృష్టంగా భావిస్తున్నాం. ర‌విగారు, ఏక్తాగారు.. సినిమా రేంజ్‌ను పెంచారు. కొత్త‌వాళ్ల‌ను న‌మ్మి మాకు స‌పోర్ట్ చేశారు. సుశాంత్‌గారు స‌హా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. కొత్త సుశాంత్‌ను చూస్తారు. త‌న‌లో చాలా ఫైర్ ఉంటుంది. ఈ సినిమా త‌ర్వాత త‌న‌కు చాలా కొత్త సినిమాలు వ‌స్తాయి’’ అన్నారు.

హీరోయిన్ మీనాక్షి చౌద‌రి మాట్లాడుతూ ‘‘తొలి సినిమా కావ‌డంతో కాస్త నెర్వ‌స్‌గా ఫీల్ అయ్యాను. అయితే నిర్మాతలు రవిగారు, ఏక్తాగారు, హ‌రీశ్‌గారి వ‌ల్ల మ‌న అనే భావం ఎక్క‌వగా క్రియేట్ అయ్యింది. టాలెంటెడ్ టీమ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నీ ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు.యాక్ట‌ర్ వెంక‌ట్ మాట్లాడుతూ ‘‘రెండు పాండమిక్స్, లాక్‌డౌన్స్‌ను త‌ట్టుకుని ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్న నిర్మాత‌ల‌కు థాంక్స్‌. అలాగే న‌న్ను మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తున్న ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్ గారికి, నిర్మాత హ‌రీశ్ గారికి కూడా థాంక్స్‌. ఈ సినిమా సుశాంత్‌కు చాలా పెద్ద హిట్ కావాల‌ని అనుకుంటున్నాను. 2018 మిస్ ఇండియా అయిన మీనాక్షి చౌద‌రి ఈ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కావ‌డం చాలా హ్యాపీ. అభిన‌వ్‌, ప్రియ‌ద‌ర్శి, కృష్ణ‌చైత‌న్య‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.

శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ ‘‘నిర్మాత హరీశ్ నాకు మంచి స్నేహితుడు. నాకు ఎంతో న‌చ్చిన స్నేహితులు ఈ సినిమాలో ఉన్నారు. సుశాంత్‌తో మంచి అనుబంధం ఉంది. చాలా మంది ఈ సినిమాతో డెబ్యూ అవుతున్నారు. సినిమా చూడ‌టానికి ఈ నెల 27న బండి తీయాల‌ని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.న‌టుడు కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ ‘‘ప్రతి ఆర్టిస్ట్‌కు త‌న టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాల‌ని క‌సి ఉంటుంది. నాకు అలాంటి అవ‌కాశం ఈ సినిమాతో ద‌క్కింద‌ని అనుకుంటున్నాను. ఇలాంటి క్యారెక్ట‌ర్‌ను నాకు ఇచ్చిన ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌, నిర్మాత హ‌రీశ్‌గారికి థాంక్స్‌. అక్కినేని హీరో అయిన సుశాంత్‌గారితో క‌లిసి న‌టించ‌డం హ్యాపీగా అనిపించింది. త‌ను ఇచ్చిన స‌పోర్ట్‌తో నా క్యారెక్ట‌ర్‌ను ఇంకా ఈజ్‌తో చేశాను’’ అన్నారు.సినిమాటోగ్రాఫ‌ర్ సుకుమార‌న్ మాట్లాడుతూ ‘‘డిఫ‌రెంట్ మూవీ. స‌పోర్ట్ చేసిన డైరెక్ట‌ర్ ద‌ర్శ‌న్‌, నిర్మాత‌లు, ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు.

- Advertisement -