‘హౌస్ అరెస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

155
house arrest
- Advertisement -

నిర్మాణ సంస్థ‌, డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. ఈ క్రమంలో ఈ బ్యాన‌ర్‌లో తొలి చిత్రంగా ‘హౌస్ అరెస్ట్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. థియేట‌ర్స్‌లో ఆగ‌స్ట్ 27న‌ విడుద‌లవుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేవ్‌, ఫ్ర‌స్టేటెడ్ సునైన‌, కౌశిక్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్రా ద‌ర్శ‌క‌త్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌శాంత్ వ‌ర్మ‌ రామ్ ప్ర‌సాద్‌, చంద్ర‌మ‌హేశ్‌, అశోక్ రెడ్డి, ఎన్‌.శంక‌ర్‌, చందు రెడ్డి తదితరులు పాల్గొని బిగ్ టిక్కెట్టుని విడుదల చేశారు. ఈ సందర్భంగా…

సోహైల్ మాట్లాడుతూ ‘‘ఓరోజు డైరెక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డిగారు ఫోన్ చేసి చిన్న పిల్ల‌ల మూవీ చేస్తున్నామ‌ని అన్నారు. ఈ సినిమాలో చేసిన పిల్ల‌లు..పిల్ల‌ల్లాగా లేరు పిడుగుల్లాగా అనిపిస్తున్నారు. ఈ సినిమాను చిన్న‌పిల్ల‌లే కాదు, పెద్ద‌వాళ్లు కూడా చూసేంత బాగా ఉంటుంది. శ్రీనివాస‌రెడ్డ‌న్న‌, స‌ప్త‌గిర‌న్న‌, ర‌మేశ‌న్న ఇలా మంచి ఆర్టిస్టులు కూడా న‌టించారు. 90 ఎం.ఎల్ వంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీ త‌ర్వాత శేఖ‌ర్ రెడ్డిగారు చిన్న‌పిల్ల‌లు చేయ‌డ‌మ‌నేది ఆయ‌న ప్యాష‌న్‌ను తెలియ‌జేస్తోంది. ఇక కాన్సెప్ట్‌కు త‌గిన‌ట్లు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చే అనూప్ రూబెన్స్‌గారు, ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్‌ను అందించారు. అంద‌రూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’’ అన్నారు.

డైరెక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డి ఎర్రా మాట్లాడుతూ ‘‘‘90 ఎం.ఎల్‌’ త‌ర్వాత హౌస్ అరెస్ట్ అనే సినిమా చేయ‌డానికి కార‌ణం అనూప్ రూబెన్స్‌. నా త‌ల్లిదండ్రుల‌కు, నా సినిమా గురువు చంద్ర మ‌హేశ్‌గారికి, డైరెక్ట‌ర్‌గా జ‌న్మ‌నిచ్చిన హీరో కార్తికేయ‌గారికి, నిర్మాత అశోక్ రెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు. వారికెప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. ఈ జ‌న‌రేష‌న్‌లో పిల్ల‌లు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు వారెలా రియాక్ట్ అవుతున్నారనే విష‌యాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. శ్రీనివాస్‌రెడ్డిగారు, స‌ప్త‌గిరిగారు, అదుర్స్ ర‌ఘుగారు, ర‌విబాబుగారు, ర‌విప్ర‌కాశ్‌గారు, కౌశిక్‌ల‌తో పాటు జాను, శివ‌, నేత్ర‌, రితేశ్‌, వ‌శీక‌ర్‌, ఆహా, ఖుషి వంటి చిన్న‌పిల్ల‌లు కూడా న‌టించారు. ఓ ఇంట్లోకి అర్ద‌రాత్రి దొంగ‌లు ప‌డ్డ‌ప్పుడు ఆ ఇంట్లోని పిల్ల‌లు వారినెలా ఆడుకున్నార‌నేదే ఈ సినిమా. యువరాజ్‌గారి సినిమాటోగ్ర‌ఫీ, అనూప్‌గారి మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ రాత్రిప‌గ‌లు క‌ష్ట‌ప‌డ్డారు. ప్రైమ్ షో నిరంజ‌న్ రెడ్డిగారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ అశ్రిన్ రెడ్డిగారు, చైత‌న్య‌గారు న‌మ్మ‌కంతో మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపారు. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్మెంట్ నాకు పున‌ర్జ‌న్మ ఇచ్చారు. క‌థ విన‌గానే కొత్త‌గా ఉంద‌ని మంచి బ‌డ్జెట్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. నిర్మాతల వ‌ల్ల‌నే సినిమా ఇంత రిచ్‌గా క‌నిపిస్తుంది. పిల్ల‌ల గురించి చేసిన తారె జ‌మీన్ ప‌ర్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ వంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అంద‌రికీ తెలిసిందే. తెలుగులో పిల్ల‌ల సినిమాలు వ‌చ్చి 15 ఏళ్ల అవుతున్నాయి. చాలా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న మంచి పిల్ల‌ల సినిమా ఇది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసేలా సినిమా ఉంటుంది. ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘చిన్న పిల్లలతో చేసిన హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్ మా హౌస్ అరెస్ట్‌. నిరంజ‌న్ రెడ్డిగారు, అశ్రిత్ రెడ్డి, చైత‌న్య‌గారు మంచి టీమ్‌తో చ‌క్క‌టి ప్ర‌య‌త్నం చేశారు. ప్రైమ్ షో చేస్తున్న ఈ తొలి ప్రాజెక్ట్ చాలా పెద్ద హిట్ కావాలి. శేఖ‌ర్ రెడ్డిగారు సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ నెల 27న విడుద‌లవుతున్న ఈ చిత్రం, థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను అరెస్ట్ చేస్తుంద‌ని అనుకుంటున్నాం’’ అన్నారు.

స‌ప్త‌గిరి మాట్లాడుతూ ‘‘సాధారణంగా 90 ఎం.ఎల్ వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమా త‌ర్వాత ఎవ‌రైనా నెక్ట్స్ కూడా క‌మ‌ర్షియ‌ల్ సినిమానే చేస్తారు. కానీ.. శేఖ‌ర్ రెడ్డిగారు ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారి స‌పోర్ట్‌తో చిన్న పిల్ల‌ల సినిమా చేయడం గొప్ప విష‌యం. ఆయన గ‌ట్స్‌కు థాంక్స్‌. స్క్రిప్ట్‌ను న‌మ్ముకుని ఓ య‌జ్ఞంలా శేఖ‌ర్‌గారు సినిమా పూర్తి చేశారు. పిల్ల‌లంటే దేవుళ్ల‌తో స‌మానం. వారి కోస‌మైనా సినిమా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డిగారు, అశ్రిత్‌రెడ్డి, చ‌ర‌ణ్‌గారికి అభినంద‌న‌లు’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ ‘‘శేఖ‌ర్ రెడ్డిగారు చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసే ద‌ర్శ‌కుల లిస్ట్‌లో ఉంటారు. చిన్న‌పిల్ల‌ల‌పై సినిమా చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ఆయ‌న ఈ సినిమాను ఇంత బాగా తీయ‌డానికి కార‌ణం నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, అశ్రిత్ రెడ్డి, చైత‌న్య‌గారు. వారికి హ్యాట్పాఫ్‌. ఇలా వాళ్లు ఇంకా మంచి సినిమాలు చేసి పెద్ద నిర్మాత‌లుగా పేరు తెచ్చుకోవాలి. శ్రీనివాస్‌రెడ్డిగారు, స‌ప్త‌గిరిగారు, తాగుబోతు ర‌మేశ్‌గారు.. ఇలా నాకు ఇష్ట‌మైన క‌మెడియ‌న్స్ ఈ సినిమాలో ఉన్నారు. ఇంత మంచి టీమ్‌తో చేసిన ఈ సినిమా ఆగస్ట్ 27న విడుదలవుతుంది. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘‘నిరంజన్ రెడ్డిగారితో నా నెక్ట్స్ మూవీ చేస్తున్నాను. చిన్నపిల్లల సినిమా అంటే చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను. టెక్నీషియ‌న్స్ పేర్లు చూస్తే యువ‌రాజ్‌గారు, అనూప్‌గారు వంటి పేర్లు క‌నిపించాయి. చిన్న‌పిల్లల సినిమాను ఇంత రిచ్‌గా చేశారంటే, నా సినిమాను ఎంత బాగా చేస్తారోన‌నిపించింది. సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత‌లు. నేను వారితో క‌లిసి ట్రావెల్ అవుతుండ‌టం చాలా హ్యాపీగా ఉంది. శ్రీనివాస్‌రెడ్డిగారు, స‌ప్త‌గిరిగారు, తాగుబోతు ర‌మేశ్‌గారు, ర‌ఘుగారు, కౌశిక్‌ ఇలా చాలా మంచి ఆర్టిస్టులు వ‌ర్క్ చేశారు. యువ‌రాజ్‌గారు, అనూప్‌గారు సినిమాకు వ‌ర్క్ చేసిన తీరు అద్భుతం. పిల్ల‌ల‌తో పాటు ఎంటైర్ ఫ్యామిలీ సినిమాను చూసి హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ ‘‘క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్స్‌తో ప్ర‌జ‌లంద‌రూ చెప్ప‌లేని హౌస్ అరెస్ట్‌ను ఫీల్ అయ్యారు. పిల్ల‌ల‌తో పాటు పెద్ద ఆర్టిస్టులు కూడా చ‌క్క‌టి ఎఫ‌ర్ట్స్ పెట్టార‌ని అర్థ‌మ‌వుతుంది. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్‌, క‌రోనా స‌మ‌యంలో ఓ స్క్రిప్ట్‌ను ఓకే చేయించి చాలా త్వ‌ర‌గా పూర్తి చేయ‌డం విశేషం. నిరంజ‌న్ రెడ్డి, అశ్రిత్‌ల‌కు ఈ సినిమా నిర్మాత‌గా చాలా మంచి పేరు తెచ్చిపెట్టాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. కౌశిక్ మాట్లాడుతూ ‘‘నేనుకూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కెరీర్ స్టార్ట్ చేశాను. వీరితో వ‌ర్క్ చేస్తుంటే, నాకు పాత రోజులు గుర్తుకు వ‌చ్చాయి. చాలా గ్యాప్ త‌ర్వాత చిన్న పిల్ల‌లు సినిమా చూడ‌బోతున్నాం. శేఖ‌ర్ రెడ్డిగారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమాను పెద్ద హిట్ చేస్తే ఇలాంటి చిన్న‌పిల్ల‌ల సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తాయి’’ అన్నారు.

తాగుబోతు ర‌మేశ్ మాట్లాడుతూ ‘‘శేఖ‌ర్ రెడ్డిగారి చేసిన 90 ఎం.ఎల్ సినిమాలో యాక్ట్ చేశాను. ఇప్పుడీ సినిమాలో మంచి రోల్ చేశాను. ఆగ‌స్ట్ 27న సినిమా రిలీజ్ అవుతుంది. క‌రోనా కార‌ణంగా హౌస్ అరెస్ట్‌లో ఉన్న‌వాళ్లంద‌రూ ఈ సినిమా చూస్తే రిలాక్స్ అవుతారు. యువ‌రాజ్‌గారు, అనూప్‌గారు చాలా పెద్ద రేంజ్‌లో ఎలివేట్ చేశారు. పిల్ల‌లు అద్భుతంగా న‌టించారు’’ అన్నారు.

- Advertisement -