ఓటీటీలో నితిన్ ‘మాస్ట్రో’..!

199
- Advertisement -

హీరో నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ 30వ సినిమాగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం మాస్ట్రో. రాజ్‌కుమార్ ఆకెళ్ల స‌మ‌ర్ప‌ణ‌లో శ్రేష్ఠ్ మూవీస్ ప‌తాకంపై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో, నితిన్ జోడీగా నభా నటేష్‌ నటిస్తోంది. హిందీలో హిట్ కొట్టిన ‘అంధాదున్’ సినిమాకి ఇది రీమేక్ తెరకెక్కుతోంది. త‌మ‌న్నా భాటియా ఓ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, జిషు సేన్ గుప్తా ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఇక ఒక ప్రత్యేకమైన పాత్రలో శ్రీముఖి అలరించనుంది.

అయితే ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీలో వదులుతారా? అనే విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో రానున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాను 32 కోట్లకు ‘డిస్నీ హాట్ స్టార్’ వారు తీసుకున్నారనీ, ‘వినాయకచవితి’ కానుకగా వచ్చేనెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు చెబుతున్నారు.

- Advertisement -