- Advertisement -
కరోనా మహమ్మారి విజృంభనతో భారత విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడగించాయి. కోవిడ్ కేసులు అదుపులోకి వస్తున్న తరుణంలో కొన్ని దేశాలు ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి. అయితే భారతీయ విమానాలపై ఆంక్షలను మరోసారి పొడిగించింది కెనడా ప్రభుత్వం.
సెప్టెంబర్ 21 తేదీ వరకు భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డెల్టా వేరియంట్ వెలుగు చూడడంతో ఏప్రిల్ 22న ఇండియా నుంచి నేరుగా వెళ్లే విమానాలపై కెనడా నిషేధం విధించింది. వాణిజ్య, ప్రైవేట్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తుండగా.. కార్గో, మెడికల్ వస్తువుల రవాణా, మిలటరీ విమానాలకు మినహాయింపును ఇచ్చింది.
- Advertisement -